Star’s Negative Rolls: హీరోలే విలన్లు.. విలన్లే హీరోలు!

నెగిటివిటీ చూపిస్తూ సూపర్ హీరో అనిపించుకుంటున్నారు. సెపరేట్ విలన్ లేకుండా హీరోలే విలనిజం చూపిస్తున్నారు. భూతద్దం పెట్టి వెతికినా మచ్చనేది లేకుండా ఆదర్శ పురుషుడిగా కనిపించే..

Star’s Negative Rolls: హీరోలే విలన్లు.. విలన్లే హీరోలు!

Star's Negative Rolls

Star’s Negative Rolls: నెగిటివిటీ చూపిస్తూ సూపర్ హీరో అనిపించుకుంటున్నారు. సెపరేట్ విలన్ లేకుండా హీరోలే విలనిజం చూపిస్తున్నారు. భూతద్దం పెట్టి వెతికినా మచ్చనేది లేకుండా ఆదర్శ పురుషుడిగా కనిపించే టాలీవుడ్ హీరోలిప్పుడు నెగెటివ్ షేడ్స్ కావాలంటున్నారు. ఫియర్ లెస్, కేర్ లెస్ తో పాటూ కాస్త కన్నింగ్ నెస్ అవసరమే అనేస్తున్నారు.

Telugu Heroins: ఆన్ స్క్రీనైనా.. ఆఫ్ స్క్రీనైనా.. పెంచేసిన గ్లామర్ డోస్!

పుష్ప పార్ట్ 1లో కనిపించినంత వరకు బన్నీ చేసింది విలనిజమున్న హీరో క్యారెక్టర్. ఎర్రచందనం స్మగ్లర్ అంటే దొంగే కదా. అడ్డొచ్చిన పోలీసులు, రౌడీలను చంపడం.. ఎలాగైనా ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఏలేయాలనే రోల్.. అయినా అతనే హీరో. సుకుమార్ కన్విన్సింగ్ గా డిజైన్ చేశారు.. బన్నీ పవర్ఫుల్ గా నటించారు. ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. విలన్ లోనూ దాగున్న ఓ మనిషిని చూపించి అతనికున్న మానవత్వాన్ని చూపించి పుష్పరాజ్ కి పాన్ ఇండియా క్రేజ్ తీసుకొచ్చారు సుకుమార్.

Aishwarya Dhanush: ధనుష్, ఐశ్వర్య విడాకులకు కారణమిదేనా? మళ్ళీ కలుస్తారా?

పుష్పరాజ్ చూపించిన దారిలోనే నాని పయనిస్తున్నట్టు కనిపిస్తుంది. దసరా మూవీలో నాని నెగటివ్ రోల్ చేస్తున్నట్టు టాక్. అక్కడ పుష్పరాజ్ ది ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ అయితే, నానిది బొగ్గు గనుల్లో ఆదిపత్యం. పుష్ప చిత్తూర్ స్లాంగ్ మాట్లాడితే, నాని తెలంగాణ యాసలో అదరగొడతానంటున్నాడు. పుష్పరాజ్ గా గెటప్ మార్చినట్టే నాని కూడా లుక్ మొత్తం ఛేంజ్ చేశాడు. జెంటిల్ మెన్, వి లాంటి సినిమాల్లో మంచి విలన్ గా కనిపించిన నాని.. ఈసారి దసరాలో ఇంకాస్త రేంజ్ పెంచబోతున్నాడు.

Ravanasura: మాస్ రాజాతో ఆట పాట.. ఒకే సినిమాలో ఐదుగురు హీరోయిన్స్!

బాబీ డైరెక్షన్లో చేస్తోన్న సినిమాలో చిరూ అండర్ కాప్ గా మొదట్లో నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తారు. ఆ తర్వాత రవితేజతో కలిసి పోలీసాఫీసర్ గా అదరగొట్టబోతున్నారు. వెబ్ సిరీస్ కోసం నాగచైతన్య చేస్తోన్న హారర్ సిరీస్ లో చైతూ రోల్ కి కాస్త నెగటివ్ టచ్ ఉండబోతుంది. రావణాసురలో సినిమాలో రవితేజ 10షేడ్స్ చూపించబోతున్నాడు. అందులో ఒకటి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కూడా. అటు బింబిసార పిరియాడికల్ ఫిల్మ్ లో డ్యూయల్ రోల్ చేస్తున్న కల్యాణ్ రామ్.. బింబిసారగా చూపించే విలనిజం హైలైట్ కానుంది.