Suriya 42 : సూర్య సినిమా హిందీ రైట్స్ 100 కోట్లకు అమ్ముడుపోయాయ?

తమిళ హీరో సూర్య 42వ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్యకి జంటగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటిస్తుంది. ఇటీవలే భారీ సెట్ వేసి వీరిద్దరితో ఒక పాటని చిత్రీకరించింది మూవీ టీం. కాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి ఫిలిం నగర్‌లో హల్ చల్ చేస్తుంది.

Suriya 42 : సూర్య సినిమా హిందీ రైట్స్ 100 కోట్లకు అమ్ముడుపోయాయ?

Hindi rights of Surya 42 movie were sold for 100 crores

Suriya 42 : తమిళ హీరో సూర్య 42వ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్యకి జంటగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటిస్తుంది. ఇటీవలే భారీ సెట్ వేసి వీరిద్దరితో ఒక పాటని చిత్రీకరించింది మూవీ టీం. కాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి ఫిలిం నగర్‌లో హల్ చల్ చేస్తుంది.

Suriya : సూర్యతో మూవీ ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

అదేంటంటే ఈ సినిమా హిందీ రైట్స్‌‍ని ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ‘పెన్ స్టూడియోస్’ రూ.100 కోట్లకు కొనుగోలు చేసిందట. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న చిత్రానికి ఇంత ధర ఇచ్చి హక్కులను సొంతం చేసుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి కారణం సినిమా ప్రకటన అప్పుడు విడుదల చేసిన మోషన్ పోస్టర్ అని తెలుస్తుంది. ఆ మోషన్ పోస్టర్ ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అంచనాలు పెంచేసింది.

కాగా ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తపై మూవీ టీం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఈ మూవీని ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ “యూవీ క్రియేషన్స్”, తమిళ నిర్మాణ సంస్థ “స్టూడియో గ్రీన్”తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.