HIT 2: సెన్సార్ పనులు ముగించుకున్న హిట్-2.. రన్‌టైమ్ ఎంతంటే?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రాల్లో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తున్న సినిమా ‘హిట్-2’. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో యంగ్ హీరో అడివి శేష్ నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

HIT 2: సెన్సార్ పనులు ముగించుకున్న హిట్-2.. రన్‌టైమ్ ఎంతంటే?

HIT 2 Completes Censor Work And Locks Runtime

HIT 2: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రాల్లో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తున్న సినిమా ‘హిట్-2’. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో యంగ్ హీరో అడివి శేష్ నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

Hit 2 : శ్రద్ధా వాకర్‌ హత్య కేసే హిట్ 2 స్టోరీనా? అడివి శేష్ ఏం చెప్పాడు??

హిట్-2 సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను కూడా లాక్ చేసింది చిత్ర యూనిట్. హిట్-2 చిత్రాన్ని ప్రేక్షకులకు ఎంగేజింగ్ కంటెంట్‌తో అందించేందుకు ఈ సినిమాను 2 గంటల రన్‌టైమ్‌తో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. KD పాత్రలో అడివి శేష్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ అంటోంది.

Hit 2 Trailer : హిట్ 2 ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగ్ గా.. మరో హిట్ ఖాయం..

ఇక ఈ సినిమాలో అడివి శేష్ ఓ కాప్ పాత్రలో నటిస్తుండగా, అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో వయొలెన్స్ ఎక్కువగా ఉందనే కారణంతో ఈ చిత్ర ట్రైలర్‌ను యూట్యూబ్ తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు ఖచ్చితంగా ‘ఎ’ సర్టిఫికెట్ వస్తుందని పలువురు సినీ ఎక్స్‌పర్ట్స్ ముందే ఊహించారు. వారు ఊహించినట్లుగానే సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాకు A సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అయితే సినిమాలోని కంటెంట్ మాత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. డిసెంబర్ 2న రిలీజ్ కానున్న హిట్-2 ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందో చూడాలి.