Hit 2 Trailer : హిట్ 2 ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగ్ గా.. మరో హిట్ ఖాయం..

హిట్ 2లో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే హిట్ వర్స్ అని ఒక లోకం సృష్టించి వరుసగా 7 సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నట్టు, ఒక్కో సినిమాలో............

Hit 2 Trailer : హిట్ 2 ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగ్ గా.. మరో హిట్ ఖాయం..

Hit 2 Trailer Released

Hit 2 Trailer :  నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా గతంలో వచ్చిన హిట్ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. హిట్ 2లో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే హిట్ వర్స్ అని ఒక లోకం సృష్టించి వరుసగా 7 సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నట్టు, ఒక్కో సినిమాలో ఒక్కో హీరో ఉండనున్నట్టు, మధ్యలో ఆ హీరోలు కలవొచ్చు అన్నట్టు దర్శకుడు శైలేష్ కొలను చెప్పడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇటీవలే టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచగా తాజాగా హిట్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఒక అమ్మాయిని చంపేసి ముక్కలు ముక్కలు చేయడంతో కేస్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. హీరో చాలా సింపుల్ గా తీసుకుంటాడు కేసుని, త్వరగా పట్టుకుంటాను హంతకుడిని అని అంటాడు. కానీ కేసు ఎంతకీ తేలదు. ఈ లోపు హంతకుడు నరికి పెట్టిన అమ్మాయి బాడీ పార్ట్శ్ ఒక్కోటి ఒక్కొక్కరివి అని తెలియడంతో అంతా షాక్ అవుతారు. అంతేకాకుండా హంతకుడు ఇంకో మర్డర్ కూడా చేయడానికి రెడీ అవుతాడు. హంతకుడు అడివి శేష్ కి ఛాలెంజ్ విసురుతాడు. మరి శేష్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు అన్నది తెరపై చూడాలి.

Hansika Marriage : పెళ్లి పనులు మొదలుపెట్టిన హన్సిక..

మొదటి సినిమాలాగే ఇది కూడా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, సస్పెన్స్ అంశాలు ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని డిసెంబర్ 2న రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత ఇది కూడా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న అడివి శేష్ కి మరో హిట్ కన్ఫామ్ అంటున్నారు.