Abhaya : యోగిత భోసాలె ఫీమేల్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమా ‘అభయ’..
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. (Abhaya)
Yogita Bhosale Abhaya Movie
Abhaya : యోగిత భోసాలె మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘అభయ’. ఎన్ఎస్ఇ లిస్టింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ గ్రాడియెంటే ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్, ఆర్.డి.జి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై డా.విమల్ రాజ్ మాథుర్, రూపేష్ డి. గోహిల్ నిర్మాణంలో యూసఫ్ ముజామ్మిల్ సుర్తి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఇంకా మోహన్ జోషి, గణేష్ యాదవ్, కమలేష్ సావంత్, అనికేత్ కేల్కర్, రోహిత్ కోకటి, ఉమేష్ బోల్కె, డా.సంజీవ్ కుమార్ పాటిల్, హర్ష్ నికమ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also See : Vanda Devullu Pre Release Event : ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..
ఈ సందర్భంగా నిర్మాత డా.విమల్ రాజ్ మాథుర్ మాట్లాడుతూ.. అభయ కేవలం సినిమా మాత్రమే కాదు. సమాజానికి ఒక బలమైన సందేశం. ఈ మూవీ ద్వారా ఎందరికో ప్రేరణగా నిలుస్తోన్న మహిళల శక్తి, పట్టుదలను సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అని అన్నారు. నిర్మాత శ్రీ రూపేష్ డి. గోహిల్ మాట్లాడుతూ.. ఈ మూవీ ఒక అర్థవంతమైన సందేశాన్ని అందించడమే కాకుండా బలమైన కథనం, అద్భుతమైన నటీనటులతో తెరకెక్కిస్తున్నారు అని అన్నారు.

