HIT 2: ఓటీటీలో సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన హిట్-2.. కండీషన్స్ అప్లై అంటోన్న ప్రైమ్!

మర్డర్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ‘హిట్ 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటించగా, ఈ చిత్రాన్ని గతంలో వచ్చిన ‘హిట్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇక ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేయడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

HIT 2: ఓటీటీలో సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన హిట్-2.. కండీషన్స్ అప్లై అంటోన్న ప్రైమ్!

HIT 2 Surprise OTT Debut With A Twist

HIT 2: మర్డర్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ‘హిట్ 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటించగా, ఈ చిత్రాన్ని గతంలో వచ్చిన ‘హిట్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇక ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేయడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

HIT 2: న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న అడివి శేష్.. ఇక్కడ కాదు అక్కడ!

ఇక హిట్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద డిసెంబర్ 2న రిలీజ్ కాగా, ఈ సినిమాకు అన్ని చోట్లా సూపర్ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమా హిట్ వర్స్‌లో రెండో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ మూవీలో అడివి శేష్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రాణంగా నిలవగా, ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను ప్రెజెంట్ చేసిన తీరు, సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నదానికంటే మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందని చిత్ర వర్గాలు తెలుపగా.. తాజాగా సర్‌ప్రైజ్ ఇస్తూ హిట్-2 మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

HIT 2: కన్ఫం.. హిట్ 2 వచ్చేది ఆ రోజునే!

అయితే అమెజాన్ ప్రైమ్ ఈ స్ట్రీమింగ్‌ను అద్దె రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజానికి హిట్-2 చిత్రాన్ని జనవరి 6 నుండి అమెజాన్ ప్రైమ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకు రానుంది.. కానీ, అద్దె రూపంలో ఈ సినిమాను పే అండ్ వ్యూ పద్ధతిలో వీక్షించవచ్చని అమెజాన్ ప్రైమ్ తాజాగా వెల్లడించింది. ఇక ఈ సినిమాలో అడివి శేష్ సరసన అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, రావు రమోష్, తనికెళ్ల భరణి, సుహాస్, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.