Hridayam: మలయాళంలో బ్లాక్ బస్టర్.. కరణ్ జోహార్‌కు రీమేక్ హక్కులు!

కథాబలంతో చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సినిమాలుగా మారడంతో ఇప్పుడు ఇండియన్ సినిమా మొత్తం మలయాళ సినిమాపై ఓ కన్నేసి ఉంచుతుంది. చిన్న సినిమాలు..

Hridayam: మలయాళంలో బ్లాక్ బస్టర్.. కరణ్ జోహార్‌కు రీమేక్ హక్కులు!

Hridayam

Hridayam: కథాబలంతో చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సినిమాలుగా మారడంతో ఇప్పుడు ఇండియన్ సినిమా మొత్తం మలయాళ సినిమాపై ఓ కన్నేసి ఉంచుతుంది. చిన్న సినిమాలు కూడా భారీ విజయాలు దక్కించుకోవడంతో మలయాళ సినిమాల రీమేక్ హక్కులు కూడా హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. బాలీవుడ్ నుండి మన టాలీవుడ్ వరకు అందరి చూపు మలయాళ సినిమాపైనే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో మలయాళ సినిమాలు పరభాషాలలోకి రీమేక్ కాగా ఇప్పుడు మరో న్యూ ఏజ్ లవ్ స్టోరీ కూడా ఆ జాబితాలో చేరింది.

Chiru-Pawan: నువ్వా నేనా.. మెగా బ్రదర్స్ రీమేక్ ఫార్ములా!

మలయాళ చిత్ర పరిశ్రమ ఈ ఏడాది ఫస్ట్ హిట్ ను చవిచూసింది ప్రణవ్ మోహన్ లాల్ సినిమా ‘హృదయం’. జనవరి 21న రిలీజైన ఈ రొమాంటిక్ డ్రామాకు క్రిటిక్స్ తో పాటు వీక్షకుల నుండి కూడా చక్కటి స్పందన లభించటం విశేషం. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ‘హృదయం’ చిత్రంలో ప్రణవ్ మోహన్ లాల్ కి జతగా కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ నటించారు. మ్యూజిక్ ఆల్బమ్ సినిమా విడుదలకు ముందే భారీ బజ్‌ని క్రియేట్ చేయగా.. అందుకు తగ్గట్లే సినిమా కూడా ఆకట్టుకోవడంతో చిన్న సినిమా భారీ హిట్ దక్కించుకుంది.

12Th Man: ఓటీటీలో మోహన్ లాల్ సినిమా.. ఫ్యాన్స్ ఆగ్రహం!

ఒక యువకుడి జీవితంలోని వివిధ దశల ద్వారా చేసే ప్రయాణాన్ని హృదయం సినిమా ఆవిష్కరించాడు దర్శకుడు వినీత్ శ్రీనివాసన్. సినిమా విడుదలైన సమయం నుండి పలు బాషల నుండి రీమేక్ రైట్స్ కోసం సంప్రదింపులు జరుపుతుండగా ఫైనల్ గా బాలీవుడ్ బిగ్ హౌస్ ధర్మా ప్రొడక్షన్,  ఫాక్స్ స్టార్ స్టూడియోస్ హక్కులు దక్కించుకున్నాయి. కరణ్ జోహార్ ఈ సినిమాకు సంబంధించి హిందీ, తమిళ్, తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ అందిస్తామని ప్రకటించారు.