Chiru-Pawan: నువ్వా నేనా.. మెగా బ్రదర్స్ రీమేక్ ఫార్ములా!

మెగా అన్నదమ్ములు ఫుల్ స్పీడ్ లోఉన్నారు. సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశాక సినిమాల విషయంలో తగ్గేదే లే అంటూ బ్యాక్ టూ బ్యాక్ అనౌన్స్ మెంట్స్ ఇస్తున్నారు. అందులోనూ రీమేక్ సినిమాల..

Chiru-Pawan: నువ్వా నేనా.. మెగా బ్రదర్స్ రీమేక్ ఫార్ములా!

Chiru Pawan

Chiru-Pawan: మెగా అన్నదమ్ములు ఫుల్ స్పీడ్ లోఉన్నారు. సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశాక సినిమాల విషయంలో తగ్గేదే లే అంటూ బ్యాక్ టూ బ్యాక్ అనౌన్స్ మెంట్స్ ఇస్తున్నారు. అందులోనూ రీమేక్ సినిమాల విషయంలో అయితే నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇప్పటికే వరసగా రీమేక్స్ చేస్తున్న ఈ మెగా బ్రదర్స్.. మరో రెండు క్రేజీ రీమేక్ ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పారు. ఆ రీమేక్ సినిమాలేంటో..? ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారో డీటెయిల్డ్ ఇన్ ఫర్మేషన్ మీకోసం.

Pawan Kalyan: పవర్ స్టార్ మరో సినిమా.. రావణాసుర దర్శకుడితో చర్చలు!

మెగా బ్రదర్స్ ఇద్దరూ తెగ పోటీపడుతున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. స్పెషల్లీ సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేశాక వరసగా సేఫ్ ఫార్ములాగా రీమేక్స్ చేస్తున్నారు. సేఫ్ ఫార్ములా అనో, వర్కవుట్ అవుతుందని, ఇమేజ్ మ్యాచ్ అవుతుందనో, ఈజీగా కనెక్ట్ అవుతుందనో మొత్తానికి మరో రెండు రీమేక్స్ కి ఓకే చెప్పేశారు పవన్, చిరంజీవి.

Pawan Kalyan: పవన్‌కు మరోసారి అదే వాయింపుడు?

అన్న చిరంజీవి మాత్రం మెగా ఫ్యామిలీల మరో హీరోకి లేనంత దూకుడు చూపిస్తున్నారు. ఇప్పటికే 5 సినిమాల్ని అనౌన్స్ చేసి ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి.. లేటెస్ట్ గా మరో సినిమాకి ఓకే చెప్పారు. అది కూడా రీమేక్ మూవీకి. మళయాళంలో ఓటీటీలో రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్రో డాడీ మూవీని తెలుగులో రీమేక్ చెయ్యడానికి రెడీ అయ్యారు మెగాస్టార్.

Pawan Kalyan: హరిహర వీరమల్లు.. మరోసారి వాయిదా?

మోహన్ లాల్, పృధ్వి రాజ్ తండ్రీ కొడుకులుగా నటించిన బ్రో డాడీ మళయాళంలో సెన్సేషనల్ హిట్ అయ్యింది. తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్ ని చాలా క్యూట్ గా చూపించిన ఈ మూవీని చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చెయ్యబోతున్నట్టు టాక్. ఇద్దరి మధ్య స్క్రీన్ ప్రజెన్స్ తో పాటు కెమిస్ట్రీకి మంచి క్రేజ్ ఉండడంతో ఈ బ్రో డాడీ మూవీని తెలుగులో రీమేక్ చెయ్యడానికి చిరంజీవి, చెర్రీ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి ఆచార్య సినిమాలో ఆడియన్స్ కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు.

Chiranjeevi: నాన్-స్టాప్‌గా కష్టపడుతున్న మెగాస్టార్!

చిరంజీవి ఇప్పటికే రీమేక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కమ్ బ్యాక్ మూవీగా చిరంజీవి తన 150వ సినిమాని తమిళ్ సూపర్ హిట్ మూవీ కత్తిని రీమేక్ చేశారు. ఆ తర్వాత మరో మూవీ గాడ్ ఫాదర్ టైటిల్ తో మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ ని మోహన్ రాజాతో రీమేక్ చేస్తున్నారు. మోహన్ లాల్, పృధ్విరాజ్ లీడ్ రోల్స్ లో మళయాళం లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తున్నారు.

Chiranjeevi: మోహన్ లాల్‌పై పడ్డ చిరంజీవి.. మరోదానికి సై?

చిరంజీవి మరో సినిమా కూడా రీమేక్ గానే తెరకెక్కుతోంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాని మెహర్ రమేష్ డైరెక్టర్ గా తెలుగులో భోళాశంకర్ టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు మెగాస్టార్. సిస్టర్ సెంటిమెంట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా అజిత్ చేసిన వేదాళం తెలుగులో చిరంజీవి, కీర్తిసురేష్ లీడ్ రోల్స్ లో చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ రైట్స్ కూడా మెగా ఫ్యామిలీ చేతిలోనే ఉన్నాయి. ఇలా బ్యాక్ టూ బ్యాక్ రీమేక్స్ తో బిజీగా ఉన్నారు చిరంజీవి.

Chiranjeevi – Sukumar: చిరుతో సుక్కు సినిమా.. కల నిజమైందన్న లెక్కల మాస్టారు

అన్న వరసపెట్టి రీమేక్ సినిమాలు చేస్తుంటే.. తమ్ముడు పవన్ కూడా అంతే స్పీడ్ గా రీమేక్స్ అనౌన్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్.. కొత్త సబ్జెక్ట్స్ కన్నా.. మినిమం సక్సెస్ గ్యారంటీ ఉండే సినిమాలు చెయ్యడానికే ఎప్పుడూ ఇంట్రస్ట్ చూపిస్తారు. అందుకే మరో క్రేజీ రీమేక్ చెయ్యడానికి రెడీ అయ్యారు.

Chiranjeevi: చిరు లైనప్.. సినిమాకో హీరోకి అవకాశమిస్తున్న మెగాస్టార్!

పవర్ స్టార్ స్ట్రెయిట్ ఫిల్మ్స్ కన్నా.. రీమేక్స్ తోనే కెరీర్ లో సేఫ్ గేమ్ ఆడుతున్నారు. హిందీ, తమిళ్, మళయాళం ఇలా భాషతో సంబందం లేకుండా సినిమాలు రీమేక్ చేస్తున్న పవన్ మరో పవర్ పుల్ రీమేక్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సముద్రఖని డైరెక్షన్లో వినోదయసీతమ్ అనే తమిళ్ రీమేక్ చెయ్యడానికి ప్లాన్ రెడీ చేస్తున్నారు పవన్. ఈ సినిమాకి జస్ట్ 20 రోజులు డేట్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. 50 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని, ఈ రీమేక్ సినిమాని నాన్ స్టాప్ గా షూటింగ్ కంప్లీట్ చెయ్యడానికి షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకున్నారని టాక్.

Chiranjeevi : పొద్దున్న షూటింగ్.. రాత్రికి డబ్బింగ్.. స్పీడ్ పెంచిన మెగాస్టార్..

పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక చేసిన రెండు సినిమాలు రీమేక్ గానే తెరకెక్కాయి. సాగర్ చంద్ర డైరెక్షన్లో మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాని రీమేక్ చేసి భీమ్లానాయక్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. పృధ్విరాజ్, బిజుమీనన్ లీడ్ రోల్స్ లో మాస్ యాక్షన్ డ్రామా గా అయ్యప్పనుమ్ సినిమాని రానాతో కలిసి మల్టీస్టారర్ గా తెరకెక్కించి పవర్ స్టార్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా చూపించారు.

Chiru 154: మలయాళ సినిమా కథతోనే చిరుతో బాబీ సినిమా?

సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత.. రిలీజ్ చేసిన సినిమా కూడా రీమేక్ మూవీయే. హిందీలో అమితాబ్ లీడ్ రోల్ లో చేసిన పింక్ ని వకీల్ సాబ్ టైటిల్ తో రీమేక్ చేశారు పవన్ కళ్యాణ్. కోర్ట్ రూమ్ డ్రామాగా రిలీజ్ అయిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు పర్ ఫెక్ట్ కమ్ బ్యాక్ మూవీ అయ్యింది. ఈ సినిమాలతో పాటు మరో రెండు రీమేక్ సినిమాల్ని లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్.. అన్న చిరంజీవితో రీమేక్స్ విషయంలో పోటీ పడుతున్నారు.