Hrithik Roshan : అభిమాని కాళ్ళకి దండం పెట్టిన హృతిక్ రోషన్.. వైరల్ అవుతున్న వీడియో..

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కి కూడా ఇలాంటి సంఘటనే ఎదురయింది. కల్ట్ ఫిట్ కంపెనీ నిర్వహించిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో హృతిక్ రోషన్ గెస్టుగా పాల్గొన్నారు. ఓ అభిమానిని పిలవగా అతను స్టేజి మీదకు రాగానే హృతిక్ రోషన్ కాళ్ళకి నమస్కరించాడు. దీంతో వెంటనే...............

Hrithik Roshan : అభిమాని కాళ్ళకి దండం పెట్టిన హృతిక్ రోషన్.. వైరల్ అవుతున్న వీడియో..

Hrithik Roshan :  సాధారణంగా సినిమా ఈవెంట్స్ లోనో, బయటో ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలని కలిసినప్పుడు వాళ్ళ కాళ్ళకి దండం పెట్టడమో, హగ్ చేసుకోవడమో చేస్తుంటారు. అన్ని సినీ పరిశ్రమలలో ఇది జరుగుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కి కూడా ఇలాంటి సంఘటనే ఎదురయింది. కల్ట్ ఫిట్ కంపెనీ నిర్వహించిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో హృతిక్ రోషన్ గెస్టుగా పాల్గొన్నారు.

Vikram : లెక్కలు రావు.. కానీ మ్యాథ్స్ టీచర్ గా చేశా.. కోబ్రా కథ ఇదే.. ఇందులో ఇర్ఫాన్ పఠాన్ కూడా యాక్ట్ చేశాడు..

ఆ కంపెనీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారికి గిఫ్టులు ఇవ్వడానికి ఒక్కొక్కరిని వేదిక మీదకు పిలిచారు. అందులో ఓ అభిమానిని పిలవగా అతను స్టేజి మీదకు రాగానే హృతిక్ రోషన్ కాళ్ళకి నమస్కరించాడు. దీంతో వెంటనే హృతిక్ కూడా ఆ అభిమాని కాళ్ళకి నమస్కరించాడు. అతను హృతిక్ రోషన్ కంటే కూడా చిన్నవాడవడం, అతను నమస్కరించగానే హృతిక్ కూడా అతని కాళ్ళకి నమస్కరించడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు, హృతిక్ అభిమానులు హృతిక్ రోషన్ ని పొగిడేస్తున్నారు.