Hrithik Roshan : ప్రియాంక చోప్రా నువ్వు అదరగొట్టేశావ్.. హృతిక్ రోషన్ పోస్ట్ వైరల్!
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ తన హీరోయిన్ ప్రియాంక చోప్రాకి.. 'నువ్వు అదరగొట్టేశావ్' అంటూ మెసేజ్ చేశాడు. ఎందుకో తెలుసా?

Hrithik Roshan – Priyanka Chopra : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. తన హీరోయిన్ ప్రియాంక చోప్రాకి సోషల్ మీడియా ద్వారా ఒక మెసేజ్ సెండ్ చేశాడు. ప్రియాంక ఇటీవల సిటాడెల్ (Citadel) అనే అమెరికన్ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ గా వస్తున్న మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక ఈ సిరీస్ రికార్డు వ్యూస్ సాధించి వరల్డ్ టాప్ వెబ్ సిరీస్ గా నిలిచింది.
తాజాగా ఈ సిరీస్ ని హృతిక్ రోషన్ చూశాడు. సిటాడెల్ బాగా నచ్చడంతో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రియాంక అండ్ మేకర్స్ ని పొగిడేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు. “ప్రియాంక సిటాడెల్ చూశాను. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అదిరిపోయింది. మీ అద్భుతమైన వర్క్ చూసి నేను సర్‌ప్రైజ్ అయ్యాను. ప్రియాంక ఈసారి నువ్వు అదరగొట్టేశావ్. చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే” అని పోస్ట్ వేశాడు. ఇక దీనికి ప్రియాంక రెస్పాండ్ అవుతూ.. “థాంక్స్ మై ఫ్రెండ్” అంటూ రిప్లై ఇచ్చింది.
Priyanka Chopra : నేను, నా భర్త పెళ్ళికి ముందు చాలా మందితో డేటింగ్ చేశాం.. కానీ గతం అనవసరం..
కాగా వీరిద్దరి కలిసి ‘క్రిష్’ సూపర్ హీరో సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఇటీవల క్రిష్ 4 (Krrish 4) గురించి ఒక వార్త బాలీవుడ్ లో బయటకి వచ్చింది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో క్రిష్ 4 షూటింగ్ పట్టాలు ఎక్కనుందని బి-టౌన్ వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ అగ్నిపథ్ వంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన కరణ్ మల్హోత్రా క్రిష్ 4 ని డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం. ఇక 4వ భాగంలో కూడా ప్రియాంక హీరోయిన్ గా నటిస్తుందా? లేదా? చూడాలి.

Hrithik Roshan comments on Priyanka Chopra acting in Citadel

Hrithik Roshan comments on Priyanka Chopra acting in Citadel