Krrish 4 : సూపర్ హీరో క్రిష్ మళ్ళీ వస్తున్నాడు.. ఈసారి దర్శకుడు, నిర్మాతగా..

సూపర్ హీరో అంటే స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ గుర్తుకు వచ్చే మనకి హృతిక్ క్రిష్ ని పరిచయం చేశాడు. క్రిష్ 3 తరువాత మరో సీక్వెల్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా..

Krrish 4 : సూపర్ హీరో క్రిష్ మళ్ళీ వస్తున్నాడు.. ఈసారి దర్శకుడు, నిర్మాతగా..

Hrithik Roshan Krrish 4 shoot starts on 2024 second half

Krrish 4 : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) క్రిష్ సినిమాతో ఇండియన్ సూపర్ హీరోగా 2006 లోనే పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా 2003లో హృతిక్ నటించిన ‘కోయీ మిల్ గయా’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది. ఆ సినిమాలో ప్రీతీ జింటా (Preity Zinta) హీరోయిన్ గా నటించగా క్రిష్ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హృతిక్ కి జోడిగా కనిపించింది. ఇక అప్పటి వరకు సూపర్ హీరో అంటే స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ గుర్తుకు వచ్చే ఇండియన్ ఆడియన్స్‌కి.. క్రిష్ ని తమ ఫేవరిట్ సూపర్ హీరోని చేసింది.

War 2 : వార్ 2 అనౌన్స్ చేసిన హృతిక్.. టైగర్‌తో స్పై యూనివర్స్‌లోకి ఎంట్రీ షురూ..

ఈ సినిమాకి కొనసాగింపుగా 2013 లో క్రిష్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సూపర్ హీరో సిరీస్ లో నెక్స్ట్ మూవీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా క్రిష్ 4 పట్టాలు ఎక్కుతున్నట్లు సమాచారం. హృతిక్ ప్రస్తుతం ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత వార్ 2 (War 2) సినిమా తెరకెక్కించాల్సి ఉంది. ఈ రెండు పూర్తి అయిన తరువాత వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో క్రిష్ 4 మొదలు కానుందట.

NTR – Hrithik Roshan : హృతిక్‌తో తలపడబోతున్న ఎన్టీఆర్.. స్పై యూనివర్స్‌లోకి యంగ్ టైగర్!

కాగా కోయీ మిల్ గయా, క్రిష్, క్రిష్ 3 సినిమాలకు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్.. రైటర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. అయితే ఈసారి దర్శకత్వ భాద్యతలు కరణ్ మల్హోత్రా తీసుకుంటున్నాడు. గతంలో ఈ దర్శకుడు హృతిక్ అగ్నిపథ్ వంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు. అలాగే హృతిక్ తో వార్ వంటి సూపర్ హిట్ సినిమా తీసి, ప్రస్తుతం ఫైటర్ చిత్రం తెరకెక్కిస్తున్న సిద్దార్థ్ ఆనంద్, రాకేష్ రోషన్ తో కలిసి చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. మరి ఈ ఇండియన్ సూపర్ హీరో ఈసారి ఎలా అలరిస్తాడో చూడాలి.