నాగార్జున ఫుల్ హ్యాపీ.. హయ్యస్ట్ రేటింగ్ ఈ బిగ్‌బాస్‌‌కే!

నాగార్జున ఫుల్ హ్యాపీ.. హయ్యస్ట్ రేటింగ్ ఈ బిగ్‌బాస్‌‌కే!

బిగ్‌బాస్ నాల్గవ సీజన్ మొదట్లో పెద్దగా హడావుడి లేకపోయినా.. ఆశించిన రేటింగులు రాకపోయినా.. చివర్లో మాత్రం అదరగొట్టేసింది. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా.. అవినాష్, సొహెల్, మెహబూబ్, దివి, మోనాల్, అభిజిత్, అరియానా, అఖిల్ ప్రతి ఒక్కరికీ కూడా నేమూ.. ఫేమూ వచ్చేసినయి. ఎప్పటిలాగే ఈ షోలో కంటెస్టెంట్లకు వచ్చిన పాపులారిటీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు..

మొత్తానికి బిగ్‌బాస్ అయిపోయి వారం అయ్యాక ఇప్పుడు ఈ షోకి వచ్చిన లెక్కలు చూసి సంబరపడిపోతున్నారు కింగ్ నాగార్జున.. బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ మొదట్లో పత్రికల్లో, సైట్లలో విరివిగా రేటింగ్ పడిపోయింది అంటూ వార్తలొచ్చేవి.. కానీ ఇప్పుడు రేటింగ్ గురించి నాగార్జునే ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టేసి.. వావ్.. ఇది మా బిగ్ బాస్ సత్తా అని వచ్చిన సక్సెస్ గురించి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 నాగార్జున హోస్ట్‌గా మహమ్మారి విజృంభణ వేళలోనే, ఐపీఎల్ సీజన్ నడుస్తుండగా.. సెప్టెంబర్‌లో ఆవిష్కరించి ప్రసారం చేశారు. వాస్తవానికి అప్పుడు చెయ్యడంపై రకరకాల వాదనలు వినిపించాయి. ఐపీఎల్ సీజన్‌లో సినిమాలే గట్టిగా ఆడవు. అటువంటిది షో అంటూ కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. అయితే గతంలో విజయవంతంగా మూడు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షో తమ సొంత రికార్డులనే అధిగమించి అపూర్వమైన రీతిలో 21.7 టీవీఆర్‌ (ఎస్‌డీ+హెచ్‌డీ) సాధించింది.

డిసెంబ‌ర్ 20న‌ ముగిసిన బిగ్‌బాస్ షో ఆఖరి ఎపిసోడ్ గ్రాండ్ ఫినాలే ఇప్పుడు రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఎపిసోడ్‌కి 21.7 టీవీఆర్ పాయింట్స్ రాగా.. బిగ్‌బాస్ తెలుగు ఫినాలే ఈవెంట్‌లో ఇదే హ‌య్యెస్ట్. బిగ్‌బాస్ ఫైనల్‌కు ముఖ్య అతిధిగా చిరంజీవి వచ్చిన సంగతి తెలిసిందే. 16 మందితో బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప్రారంభ‌ం కాగా.. అభిజీత్, అఖిల్, హారిక‌, అరియానా, సొహైల్, దేవి నాగ‌వ‌ల్లి, జోర్దార్ సుజాత‌, గంగ‌వ్వ‌, సూర్య కిర‌ణ్, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, క‌రాటే క‌ళ్యాణి, మెహ‌బూబ్, లాస్య‌, దివి , నోయ‌ల్, మోనాల్‌లు మొద‌ట హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆఖరికి అభిజీత్ కప్పు గెలుచుకున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్‌కు 16.18రేటింగ్ రాగా.. నానీ హోస్ట్ చేసిన రెండవ సీజన్‌కు 15.0రేటింగ్ వచ్చింది. నాగార్జున హోస్ట్ చేసిన మూడవ సీజన్‌కు 17.92రేటింగ్ రాగా.. ఇప్పుడు 21.7రేటింగ్ హయ్యస్ట్ అని చెబుతున్నారు.