Salaar Update: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ అప్డేట్ లోడింగ్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. చిత్ర వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ప్రేక్షకులకు ఓ అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సలార్ టీమ్ రెడీ అయినట్లు తెలుస్తోంది.

Salaar Update: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ అప్డేట్ లోడింగ్..?
ad

Salaar Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకోవడంతో ఈ సినిమా నుండి వరుస అప్డేట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి.

Salaar: ‘విక్రమ్’ను ఫాలో అవుతున్న సలార్..?

అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త లేకపోవడంతో సలార్ చిత్రానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే బాగుంటుందని ప్రేక్షకులు పెద్ద ఎత్తున కోరుతున్నారు. ఈ క్రమంలో చిత్ర వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ప్రేక్షకులకు ఓ అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సలార్ టీమ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్‌ను మే నెలలో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలో వెల్లడించినా, కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. దీంతో ఇప్పుడు రాబోయే రెండు రోజుల్లో సలార్ చిత్రానికి సంబంధించి ఓ భారీ అప్డేట్ రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.

Salaar: గెట్ రెడీ అంటోన్న ప్రభాస్.. సలార్ వచ్చేస్తోందట!

ఈ అప్డేట్ ఖచ్చితంగా టీజర్ రిలీజ్‌కు సంబంధించిందే అయి ఉంటుందని చిత్ర వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. సలార్ చిత్రంలో ఊరమాస్ అవతారంలో ప్రభాస్ కనిపిస్తుండగా, ఆయన సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో పలువురు హేమాహేమీలు నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా, రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ప్రభాస్ ఫ్యాన్స్‌ను స్టన్ చేసేందుకు వస్తున్న ఆ అప్డేట్ ఏమిటో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.