Salaar: గెట్ రెడీ అంటోన్న ప్రభాస్.. సలార్ వచ్చేస్తోందట!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా నుండి త్వరలోనే ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట.

Salaar: గెట్ రెడీ అంటోన్న ప్రభాస్.. సలార్ వచ్చేస్తోందట!

Prabhas To Give Massive Update On Salaar

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ను కేజీయఫ్ చిత్రాల సృష్టికర్త ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ తరువాత ఎందుకనో సైలెంట్ అయిపోయారు.

Salaar: యాక్షన్‌తోనే క్లూ ఇస్తోన్న సలార్.. మీకు అర్థమవుతోందా..?

కాగా.. ఇప్పుడు సలార్ కూడా వేగం పెంచేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ఇచ్చేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అది ఈ చిత్ర టీజరా లేక వేరొక అంశమా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ అప్డేట్‌ను సాలిడ్‌గా ఇవ్వనున్నారని, అది కూడా ఆగస్టులోనే గ్యారెంటీగా ఇస్తారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్, ప్రభాస్ నుండి మాస్ యాక్షన్ మూవీని చూసి చాలా రోజులు కావడంతో, సలార్ మరోసారి ఇండియన్ రికార్డులను తిరగరాస్తుందని భావిస్తున్నారు.

Salaar: సలార్‌లో రాకింగ్ సర్‌ప్రైజ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

ఇక ప్రభాస్ ఊరమాస్ అవతారంలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ అత్యద్భుతమైన కథను అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేగాక ఈ సినిమా ప్రభాస్ పాత్రను ఆయన డిజైన్ చేసిన విధానం ప్రేక్షకులను అబ్బురపరుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.