Salaar: ‘విక్రమ్’ను ఫాలో అవుతున్న సలార్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ ఇప్పటికే ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా ఇటీవల బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకున్న ‘విక్రమ్’ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

Salaar: ‘విక్రమ్’ను ఫాలో అవుతున్న సలార్..?

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ ఇప్పటికే ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Salaar: గెట్ రెడీ అంటోన్న ప్రభాస్.. సలార్ వచ్చేస్తోందట!

అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్న ఈ సినిమా ఇటీవల బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకున్న ‘విక్రమ్’ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన విధానం సూపర్బ్‌గా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఊపేసింది. ఇక ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిన అంశం ఏమిటంటే, ఖచ్చితంగా ఈ చిత్రం క్లైమాక్స్ అని చెప్పాలి. తమిళ స్టార్ హీరో సూర్య ఈ సినిమాలో క్లైమాక్స్‌లో రోలెక్స్ పాత్రలో నటించిన తీరు అత్యద్భుతం.

Salaar: యాక్షన్‌తోనే క్లూ ఇస్తోన్న సలార్.. మీకు అర్థమవుతోందా..?

ఇక ఇప్పుడు ఇదే తరహా క్లైమాక్స్ సలార్ కోసం ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో కేజీయఫ్ రాఖీ భాయ్ ఓ కేమియో రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కేజీయఫ్ చిత్రానికి కొనసాగింపుగా సలార్ రాబోతుందనే వార్త కూడా ఇప్పటికే సినీ వర్గాల్లో వినిపిస్తుండటం.. రాకింగ్ స్టార్ యశ్ ఇంకా రాఖీ భాయ్ లుక్‌లోనే కనిపిస్తుండటంతో.. సలార్‌లో నిజంగానే కేజీయఫ్ హీరో స్పెషల్ ఎంట్రీ ఉండబోతుందనే వార్తకు మరింత బలం చేకూరుస్తోంది. మరి నిజంగానే సలార్ విక్రమ్ బాటలో వెళ్తున్నాడా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.