ప్రేమలో పడ్డానని రాయకండి ప్లీజ్.. ఎందుకంటే..

  • Published By: sekhar ,Published On : September 4, 2020 / 05:45 PM IST
ప్రేమలో పడ్డానని రాయకండి ప్లీజ్.. ఎందుకంటే..

I am Happy Single-Rashmika Mandanna: లాక్‌డౌన్ కారణంగా సెలబ్రిటీలకు ఎప్పుడూ లేనంత ఖాళీ టైం దొరికింది. దీంతో తమకిష్టమైన పనులు నేర్చుకుంటూ, ఫిజిక్‌పై మరింత ఫోకస్ పెట్టారు. గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూ తమ విశేషాలన్నిటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా కన్నడ చిన్నది రష్మిక నెటిజన్లతో ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్నారు.



ఓ నెటిజన్ ‘మీరు సింగిలేనా?’ అని అడిగగా.. ‘యస్‌ ఐయామ్‌ సింగిల్‌’ అన్నారు రష్మికా. అంతేకాదు సింగిల్‌గా ఉండటంలో ఉన్న ప్లస్‌లు, మైనస్సులు విశ్లేషించి చెప్పారు. ‘‘సింగిల్‌గా ఉండటం అనేది మన చాయిస్‌. మన కంపెనీని మనం బాగా ఎంజాయ్‌ చేయగలిగినప్పుడు మధ్యలో ఇంకొకరు ఎందుకు?



మరో ముఖ్య విషయం ఏంటంటంటే… సింగిల్‌గా ఉన్నప్పుడే మనకు రాబోయే లవర్‌లో ఎలాంటి లక్షణాలు ఉండాలనే విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. మైనస్‌ ఏంటంటే… సింగిల్‌గా ఉంటే ఎవరో ఒకరితో ప్రేమలో పడింది అనే వార్తలు వినాల్సి వస్తుంటుంది. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రస్తుతానికి ఐయామ్‌ హ్యాపీ సింగిల్‌. ఇక రష్మికా ప్రేమలో పడిందని రాయొద్దు ప్లీజ్‌’’ అన్నారు.