RRR: ‘ఆర్ఆర్ఆర్’పై ఐమాక్స్ సీఈవో కామెంట్.. ఏమన్నాడంటే?

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ‘ఐమాక్స్’ వంటి బిగ్గెస్ట్ థియేటర్ చైన్ కూడా భారీగా లాభాలను గడించిందని ఆ సంస్థ సీఈవో స్వయంగా ప్రకటించడం విశేషం.

RRR: ‘ఆర్ఆర్ఆర్’పై ఐమాక్స్ సీఈవో కామెంట్.. ఏమన్నాడంటే?

IMAX Ceo Richard Gelfond About RRR Movie

RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాకు గ్లోబల్ వైడ్‌గా వస్తున్న గుర్తింపు, ఈ సినిమా జనాలకు ఏ రేంజ్‌లో ఎక్కేసిందో స్పష్టం అవుతోంది.

Ram Charan: RRR సమయంలోనే చరణ్-సుకుమార్ కొత్త సినిమా షూటింగ్ పూర్తి.. సంచలన నిజాలు బయటపెట్టిన సుకుమార్ అసిస్టెంట్..

అయితే ఈ సినిమాతో జక్కన్న క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో మనం చూశాం. కానీ, ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ‘ఐమాక్స్’ వంటి బిగ్గెస్ట్ థియేటర్ చైన్ కూడా భారీగా లాభాలను గడించిందని ఆ సంస్థ సీఈవో స్వయంగా ప్రకటించడం విశేషం. ఐమాక్స్ సీఈవో రిచర్డ్ గెల్ఫాండ్ తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రీజినల్ సినిమాలకు పెరుగుతున్న ఆదరణ అద్భుతమని.. ఇండియా నుండి ‘ఆర్ఆర్ఆర్’, జపాన్ నుండి ‘డ్రాగన్ బాల్ సూపర్’ వంటి సినిమాల వల్ల గ్లోబల్‌గా ఐమాక్స్ భారీగా లాభాలను గడిస్తోందని ఆయన పేర్కొన్నారు.

RRR: “ఆర్ఆర్ఆర్” రికార్డులను బ్రేక్ చేసిన పాకిస్తాన్ మూవీ.. ఏంటి ఆ సినిమా?

2019లో 2 శాతంగా ఉన్న ఐమాక్స్ రెవెన్యు, ఈ యేడు ఏకంగా 35 శాతానికి పెరిగిందంటే ఇలాంటి రీజినల్ సినిమాలే కారణమని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా ఐమాక్స్ వంటి దిగ్గజ థియేటర్ చైన్‌కు లాభాల పంటను తెచ్చిపెడుతున్న సినిమాల్లో ఇండియన్ సినిమాలు కూడా ఉండటంత నిజంగా గర్వకారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే ఆస్కార్ అవార్డుల నామినేషన్స్‌లో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మున్ముందు ఇంకా ఎలాంటి అవార్డులు, రివార్డులు దక్కుతాయో చూడాలి.