RRR: “ఆర్ఆర్ఆర్” రికార్డులను బ్రేక్ చేసిన పాకిస్తాన్ మూవీ.. ఏంటి ఆ సినిమా?

రాజమౌళి తెరకెక్కించిన "RRR" ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనందరికి తెలుసు. ఇప్పటికి ఈ మూవీ మేనియా ఏమాత్రం తగ్గలేదు అంటే సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్ధమవుతుంది. తాజాగా ఈ సినిమా రికార్డులను పాకిస్తాన్ మూవీ బ్రేక్ చేసింది.

RRR: “ఆర్ఆర్ఆర్” రికార్డులను బ్రేక్ చేసిన పాకిస్తాన్ మూవీ.. ఏంటి ఆ సినిమా?

Pakistani movie that broke RRR records

RRR: రాజమౌళి తెరకెక్కించిన “RRR” ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనందరికి తెలుసు. ఇప్పటికి ఈ మూవీ మేనియా ఏమాత్రం తగ్గలేదు అంటే సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్ధమవుతుంది. తాజాగా ఈ సినిమా రికార్డులను పాకిస్తాన్ మూవీ బ్రేక్ చేసింది. “ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్” పాకిస్తాన్ పంజాబీ యాక్షన్ డ్రామా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ లో విడుదలయింది.

RRR : RRR పై పెయింట్స్‌తో తమ అభిమానం చూపించిన జపాన్ అభిమానులు

రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా యూకే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ల వర్షం కురిపిస్తుంది. యూకే లో RRR లైఫ్ టైం కలెక్షన్స్ ని, ఈ సినిమా రెండు వారలో దాటేసింది. ఇక పాక్ అభిమానులు అయితే ఈ రెండిటిని పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో భారత్ అభిమానులు.. RRR వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని దాటించి చూపించండి అంటూ బదులిస్తున్నారు..

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక కుటుంబానికి చెందిన రివెంజ్ డ్రామా ఇది. చిన్నప్పుడే జరిగిన ఎటాక్ నుంచి బయటపడిన హీరో.. ఎక్కడో బ్రతుకుతుంటాడు. అయితే అతడి గతం ఒక కలలా వెంటాడుతుంది. గతం తెలుసుకున్న హీరో తన తల్లిద్రండ్రులను చంపిన వారిని ఎలా హతమార్చాడు అనేదే సినిమా కథ. ఇటువంటి కథ మన సినిమాలు చాలానే చూసాం.