మహేష్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది నెల్లూరు కుర్రాడు.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న వీడియోలు..

  • Published By: sekhar ,Published On : August 11, 2020 / 10:57 AM IST
మహేష్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది నెల్లూరు కుర్రాడు.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న వీడియోలు..

సూపర్‌స్టార్ మహేష్ బాబుకు పుట్టినరోజు కానుకగా ఇప్పటివరకు ఎవరూ ఇవ్వని అరుదైన కానుకలను బహూకరించాడు కిరణ్ అనే ఓ ప్రతిభా కిరణం. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘రమణా లోడెత్తాలిరా’ ఫైట్‌తో పాటు… కొండారెడ్డి బురుజు సెంటర్-ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్‌ను కిరణ్ అద్భుతంగా రీ-క్రియేట్ చేసి… సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాడు.



ఈ కూర్రాడి పూర్తి పేరు మీనంగారి కిరణ్. స్వస్థలం నెల్లూరు. పరిస్థితుల ప్రభావం వల్ల తొమ్మిదో తరగతితో చదువు ఆపేసి.. పెంకుల పని చేస్తున్న 19 ఏళ్ల కిరణ్.. తన ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తూ.. నాన్న లేని లోటు తీర్చుతూ… తమ చేపల వృత్తిలో అమ్మకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు.

సినిమాలంటే తనకు ప్రాణమని.. ఇంతకుముందు కూడా తాను ‘ఎల్.కె.ఈవెంట్స్’ పేరిట ‘సర్కార్, కాటమరాయుడు’ చిత్రాల్లోని ఫైట్స్ రూపొందించానని.. అయితే మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా రూపొందించిన ఈ రెండు ఫైట్స్ వైరల్ అవ్వడం… ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి వాటిని ట్వీట్ చేయడం నమ్మశక్యం కాకుండా ఉందని ఆనందంతో ఉక్కరిబిక్కిరి అవుతున్నాడు మీనంగారి కిరణ్. ఇక సాక్షాత్తూ… మహేష్ బాబు నుంచి పిలుపు వస్తే.. ఇంకెంత సంబరపడిపోతాడో చూడాలి మరి..!