Vamshi Paidipalli : ఇంతమంది స్టార్స్‌తో ఏం సినిమా తీస్తున్నావు పైడి??

మహర్షి సినిమా తర్వాత వంశీ పైడిపల్లి ఇటీవలే తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసాడు. తమిళ స్టార్ హీరో విజయ్ తో తెలుగు-తమిళ్ రెండు భాషల్లో.............

Vamshi Paidipalli : ఇంతమంది స్టార్స్‌తో ఏం సినిమా తీస్తున్నావు పైడి??

Talapathi 66

Vamshi Paidipalli :  మహర్షి సినిమా తర్వాత వంశీ పైడిపల్లి ఇటీవలే తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసాడు. తమిళ స్టార్ హీరో విజయ్ తో తెలుగు-తమిళ్ రెండు భాషల్లో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. విజయ్ 66వ సినిమాగా ఇది తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

అయితే ఈ సినిమాలో నటించే యాక్టర్స్ కి వెల్కమ్ చెప్తూ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్. ఈ మేరకు ఆ పోస్టర్స్ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో ఉన్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, సంగీత, యోగిబాబు, కిక్ శ్యామ్, సంయుక్త… ఇలా చాలా మంది యాక్టర్స్ నటిస్తున్నట్టు పోస్ట్ చేశారు. మరింతమంది ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ సమాచారం.

Mahesh Babu : బాలీవుడ్ పై మహేష్ వ్యాఖ్యలు.. తప్పేమి లేదు అంటున్న బాలీవుడ్ సీనియర్ యాక్టర్

అయితే ఇంతమంది స్టార్స్ ఉండటంతో సోషల్ మీడియాలో డైరెక్టర్ వంశి పైడిపల్లిని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. తమిళ స్టార్ హీరోతో సినిమా తీస్తూ తమిళ్, తెలుగు స్టార్ యాక్టర్స్ అందర్నీ ఈ సినిమాలో వాడేస్తున్నావు, ఎలాంటి సినిమా తీస్తున్నావు వంశీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం.. ఇలా చాలా మంది జనాలు ఉండే సినిమా లేదా ఉమ్మడి కుటుంబాలు లాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా అని సరదాగా అడుగుతున్నారు. మరి ఇంత స్టార్ క్యాస్టింగ్ పెట్టుకొని వంశీ పైడిపల్లి ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి అంటే వచ్చే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.