SSMB28: బసిరెడ్డిని మించిన విలన్.. మహేష్‌తో మామూలుగా ఉండదంటున్న జగపతి బాబు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమాలో విలన్ గా తన పాత్ర ఎలా ఉండబోతుందనే విషయాన్ని నటుడు జగపతి బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

SSMB28: బసిరెడ్డిని మించిన విలన్.. మహేష్‌తో మామూలుగా ఉండదంటున్న జగపతి బాబు!

Jagapathi Babu About His Role In SSMB28

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో, ఈసారి వీరి కాంబోలో ఎలాంటి మూవీ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

SSMB28 : హాలిడే వెకేషన్‌కి చెక్కేస్తున్న మహేష్ బాబు.. SSMB28 షూటింగ్ పరిస్థితి ఏంటి?

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ మూవీలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, తాజాగా ఆయన తన పాత్రకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ.. మహేష్ బాబుతో చేస్తున్న సినిమాలో తన పాత్ర చాలా క్రూరంగా ఉంటుందని తెలిపాడు.

SSMB28 : రూమర్స్ కి కౌంటర్ ఇస్తూ.. సూపర్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. మే 31!

గతంలో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేసిన ‘అరవింద సమేత’లో బసిరెడ్డి పాత్రకంటే కూడా ఈ సినిమాలో ఎక్కువ విలనిజం చూపించబోతున్నట్లు జగపతి బాబు తెలిపాడు. ఇలా మహేష్ బాబు సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను జగపతి బాబు వెల్లడించడంతో, ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.