Jagapathi Babu : జగపతి బాబు తల్లి నివసిస్తున్న ఇంటిని చూస్తే షాక్ అవుతారు.. అడివి లాంటి చోటులో ఒకే గదిలో!
సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా అందర్నీ భయపెడుతున్న జగపతిబాబు (Jagapathi Babu) ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నాడు. తాజాగా తన తల్లి జీవన శైలిని, ఆమె నివసిస్తున్న ఇంటిని చూపిస్తూ ఒక వీడియో షేర్ చేశాడు.

Jagapathi Babu shares his mother house and life style
Jagapathi Babu : టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు జగపతిబాబు (Jagapathi Babu). నిర్మాత కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా తనకంటూ ఒక స్టైల్ ని ఏర్పరచుకొని ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక బాలకృష్ణ (Balakrishna) లెజెండ్ సినిమాలో మొదటిసారి విలన్ గా కనిపించి తనలోని విలనిజంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాదు, ఇండస్ట్రీలో బలమైన ప్రతినాయకుడి పాత్ర కోసం వెతుకుతున్న ఫిలిం మేకర్స్ అందరికి బెస్ట్ ఛాయస్ అయ్యాడు. దీంతో ప్రస్తుతం విలన్ గా స్టార్ హీరోలు సినిమాల్లో నటిస్తూనే, పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు.
Mosagallaku Mosagadu : మోసగాళ్లకు మోసగాడు వచ్చేస్తున్నాడు.. రీ రిలీజ్‌కి రంగం సిద్ధం..
ఇక కొంత కాలంగా జగపతి బాబు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఆస్ట్రేలియాలో చేపలు మార్కెట్ ని చూపిస్తూ ఒక వీడియో షేర్ చేయగా అది వైరల్ అయ్యింది. అలాగే తన పై వచ్చే రూమర్స్ కి బదులిస్తూ జగ్గు భాయ్ షేర్ చేసే పోస్ట్ లు అందర్నీ నవ్విస్తున్నాయి. తాజాగా తన తల్లి జీవన శైలిని, ఆమె నివసిస్తున్న ఇంటిని చూపిస్తూ ఒక వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Pushpa 2 : పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు.. గుడ్ న్యూస్ చెప్పిన సుకుమార్!
ఆ వీడియోలో జగపతి బాబు మాట్లాడుతూ.. ‘శ్రీరామనవమి సందర్భంగా మా అమ్మ ఇంటికి వచ్చాను. ఈ చోటు చూసి ఏదో అడవి అని అనుకోకండి. ఇది కూడా హైదరాబాద్ లోనే ఉంది. మా అమ్మకి సింపుల్ గా ఉండడం అంటే ఇష్టం. ఒక యోగిలా ఉండడం ఆమెకు నచ్చుతుంది. శ్రీరామనవమి కావడంతో పానకం తాగుదాం అని ఇక్కడికి వచ్చాను. అంతేకాదు చాలా రోజులు తరువాత ఆమె చేతి వంట కూడా తినబోతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఆమె నివసిస్తున్న చోటుని చూపించాడు. కేవలం ఒక గదిలో, అడివిలో పర్ణశాల మాదిరి ఆ ఇల్లు ఉంది.
Shhhhh. Evariki cheppaddhu.. ammaki antha simple ga untundhi ani cheppatam istam ledhu. pic.twitter.com/0iJWOBCgBb
— Jaggu Bhai (@IamJagguBhai) March 30, 2023