జయసుధ పెద్దకొడుకు రిసెప్షన్ – తరలి వచ్చిన తారాలోకం..

సహజ నటి జయసుధ పెద్దకొడుకు రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది..

  • Published By: sekhar ,Published On : March 1, 2020 / 07:28 AM IST
జయసుధ పెద్దకొడుకు రిసెప్షన్ – తరలి వచ్చిన తారాలోకం..

సహజ నటి జయసుధ పెద్దకొడుకు రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది..

సహజ నటి జయసుధ ఇంట జరిగిన రిసెప్షన్‌కు తారాలోకం కదిలి వచ్చింది. జయసుధ, నితిన్ ద్వారకాదాస్ (లేట్) దంపతుల పెద్ద మారుడు నిహార్ వివాహ రిసెప్షన్‌ శనివారం హైదరాబాద్ పార్క్ హయత్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ రిసెప్షన్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. టాలీవుడ్‌ సీనియర్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, నటసింహ నందమూరి బాలకృష్ణ, సతీమణి వసుంధర, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, అమల, సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సీనియర్ నరేష్, మోహన్‌బాబు దంపతులు, తలసాని శ్రీనివాస్ యాదవ్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, మురళీ మోహన్, టి.సుబ్బిరామి రెడ్డి దంపతులు, దిల్ రాజు, వంశీ పైడిపల్లి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అలనాటి కథానాయికలు ప్రభ, ఖుష్బూ, నదియా, సుహాసిని తదితరులంతా కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ వివాహ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నిహార్ వివాహం ఫిబ్రవరి 26న ఢిల్లీకి చెందిన అమృతతో జరిగిన విషయం తెలిసిందే. జయసుధకు నిహార్ కపూర్, శ్రీయాన్ కపూర్ ఇద్దరు కుమారులున్నారు. నిహాన్‌ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు. నిహార్ గతంలో ‘బస్తీ’ అనే చిత్రంలో హీరోగా నటించాడు.
Jayasudha kapoor's elder son Nihar's wedding reception with Amrit

Jayasudha kapoor's elder son Nihar's wedding reception with Amrit