Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్.. ఎందుకో తెలుసా?

ఇటీవల మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు సెలబ్రేషన్స్ చేశారు. అదే రోజు సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు థియేటర్స్ లో ఈ సినిమాను వేయగా అభిమానులు థియేటర్స్ వద్ద హంగామా చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్.. ఎందుకో తెలుసా?

Jr NTR Fans arrested in Machilipatnam

Jr NTR Fans :  జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమా షూట్ తో బిజీగా ఉన్నారు. RRR తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ 30వ సినిమా దేవర(Devara) మొదలుపెట్టారు. జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా, కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ 31వ సినిమా ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో తెరకెక్కనుంది. ఆ తర్వాత బాలీవుడ్(Bollywood) వార్ 2లో సైఫ్ అలీఖాన్ తో నటించనున్నాడు ఎన్టీఆర్. ఈ అప్డేట్స్ అన్ని ఇటీవల ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఇచ్చి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశారు.

ఇటీవల మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు సెలబ్రేషన్స్ చేశారు. అదే రోజు సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు థియేటర్స్ లో ఈ సినిమాను వేయగా అభిమానులు థియేటర్స్ వద్ద హంగామా చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

మచిలీపట్టణం సిరి కృష్ణ, సిరి వెంకట్ థియేటర్ లో ఎన్టీఆర్ బర్త్ డే రోజున సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేశారు. దీంతో అభిమానులు బ్యానర్లు, పోస్టర్లు కట్టి థియేటర్ బయట హంగామా చేశారు. కొంతమంది అభిమానులు వేట కొడవళ్లు, కత్తులు పబ్లిక్ గా తీసుకొచ్చి రెండు మేకలను అక్కడే రోడ్డు మీద చంపి వాటి రక్తంతో ఎన్టీఆర్ దేవర పోస్టర్ కు రక్తాభిషేకం చేసి అక్కడ భయానకం సృష్టించారు. రోడ్డు మీద జనాలు వీరివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమంది పబ్లిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు థియేటర్ వద్దకు చేరుకొని ఈ పని చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అరెస్ట్ చేశారు.

దీనిపై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పబ్లిక్ గా వేట కొడవళ్లు, కత్తులు పట్టుకొని తిరుగుతూ, పబ్లిక్ గా రోడ్డు మీద మేకలను చంపి వాటి రక్తంతో ఎన్టీఆర్ ఫోటోలకు అభిషేకం చేస్తూ అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురించేశారు. పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసి జనాలకు ఇబ్బంది కలిగించారు అని తెలిపారు. అరెస్ట్ చేసిన వారి దగ్గర సంతకాలు తీసుకొని హెచ్చరించి వదిలేసినట్టు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

NTR : ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ థ్యాంక్స్.. ఎలా చెప్పాడో తెలుసా?

అదే రోజు విజయవాడ థియేటర్లో క్రాకర్స్ పేల్చి మంటలు చెలరేగేలా చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. థియేటర్ లో కొంతభాగం ఆ మంటలకు కాలిపోయింది. లండన్ లో కూడా ఓ థియేటర్ లో క్రాకర్స్ పేల్చడంతో మంటలు వచ్చి, పొగలు రావడంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరిగెత్తారు. ఈ సంఘటనలతో పలువురు ఎన్టీఆర్ అభిమానులను విమర్శిస్తున్నారు. అభిమానం ఉండాలి కానీ మరీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు అని కామెంట్స్ చేస్తున్నారు.