K Viswanath : బాలీవుడ్‌లో విశ్వనాథ్ సినీ ప్రయాణం..

తెలుగు తెర పై ఎన్నో ఆణిముత్యాలు చిత్రీకరించిన స్వాతిముత్యం దివికేగిసింది. కళాతపస్వి కె.విశ్వనాథ్ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఆయన సినిమాలు చేశారు. హిందీలో మొత్తం మీద...

K Viswanath : బాలీవుడ్‌లో విశ్వనాథ్ సినీ ప్రయాణం..

K Viswanath bollywood

K Viswanath : తెలుగు తెర పై ఎన్నో ఆణిముత్యాలు చిత్రీకరించిన స్వాతిముత్యం దివికేగిసింది. కళనే కథగా చూపించే కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం (ఫిబ్రవరి 2) రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా వయోభారంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులంతా కళాతపస్వి మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

K Viswanath : తీరని కె.విశ్వనాథ్ రెండు కోరికలు..

తెలుగు పరిశ్రమకి సౌండ్ ఇంజనీర్ గా పరిచమై, 1965 లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారిన కె.విశ్వనాథ్ దాదాపు 50 సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఆయన సినిమాలు చేశారు. హిందీలో మొత్తం మీద 10 సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే వీటిలో మూడు సినిమాలు స్ట్రెయిట్ స్టోరీస్, మిగిలిన ఏడు సినిమాలు సౌత్ లో విశ్వనాథ్ తెరకెక్కించిన సినిమాలకు రీమేక్ గా వచ్చాయి.

1976 లో జయప్రద, చంద్రమోహన్ నటించిన సిరిసిరి మువ్వా సినిమాని రీమేక్ చేస్తూ 1979 లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘సర్గం’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా జయప్రద హీరోయిన్ గా నటించగా, రిషి కపూర్ హీరోగా కనిపించాడు. ఆ తరువాత రాకేష్ రోషన్ తో ‘శుభోదయం’, ‘శుభలేఖ’ రీమేక్. మిథున్ చక్రబోర్తితో ‘సప్తపది’, జితేంద్రతో ‘జీవన జ్యోతి’, గిరీష్ కర్నాడ్ తో ‘శంకరాభరణం’, అనిల్ కపూర్ తో స్వాతిముత్యం చిత్రాలను రీమేక్ చేశారు.

విశ్వనాథ్ బాలీవుడ్ డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో జయప్రద హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలు తరువాత స్ట్రెయిట్ స్టోరీస్ తో.. జాకీ ష్రాఫ్ తో ‘సంగీత్’, అజయ్ దేవగన్ తో ‘ధన్వాన్’, నటి రేఖతో ‘ఔరత్ ఔరత్ ఔరత్’ తెరకెక్కించారు.