Kajal Agarwal : తల్లి కాబోతున్న కాజల్.. అధికారికంగా ప్రకటించిన గౌతమ్

తాజాగా కాజల్ తల్లి కాబోతున్నట్టు కాజల్ భర్త గౌతమ్ కిచ్లునే తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. నిన్న న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ అగర్వాల్ ఫోటో షేర్ చేసి.. ఈ కొత్త సంవత్సరంలో నీ రాక.....

Kajal Agarwal : తల్లి కాబోతున్న కాజల్.. అధికారికంగా ప్రకటించిన గౌతమ్

Kajal Agarwal

Kajal Agarwal :   టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గత సంవత్సరం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాల వేగం తగ్గించింది. అప్పుడప్పుడు తన భర్త బిజినెస్ లు కూడా చూసుకుంటుంది. గత కొన్ని రోజులుగా కాజల్ తల్లి కాబోతుందని వార్తలు వచ్చాయి. అయితే వాటిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాజల్ ఒప్పుకున్న సినిమాల నుంచి కూడా తప్పుకోవడం, ఉన్న సినిమాలు ఫాస్ట్ గా పూర్తి చేయడం, ప్రస్తుతం ముంబైలోనే ఉండటం ఇవన్నీ కూడా కాజల్ తల్లి కాబోతుందనే తెలుస్తుంది. కాని దీనిపై వీళ్ళు ఎటువంటి ప్రకటన చేయలేదు.

Acharya : ‘ఆచార్య’ ఐటెంసాంగ్ లో మెగాస్టార్ తో స్టెప్పులేసిన రెజీనా\

తాజాగా కాజల్ తల్లి కాబోతున్నట్టు కాజల్ భర్త గౌతమ్ కిచ్లునే తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. నిన్న న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ అగర్వాల్ ఫోటో షేర్ చేసి.. ఈ కొత్త సంవత్సరంలో నీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని జత చేశాడు. దీంతో ఇది చూసిన ఫ్యాన్స్‌, నెటిజన్స్ కాజల్‌ త్వరలో తల్లి కాబోతుందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అని ఆ పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. కాజల్ దంపతులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.