Kalyan Ram : నెగిటివిటీ వర్కవుట్ అవుతుందంటున్న కళ్యాణ్ రామ్..

ఫిబ్రవరి 10న ‘అమిగోస్’ రిలీజ్ కు రెడీ అయింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో అమిగోస్ ని నిర్మించారు. మూడు షేడ్స్ లో కళ్యాణ్ రామ్ కొత్తగా ఉండగా కంప్లీట్ నెగటివ్ క్యారెక్టర్ చేయడం ఆసక్తి రేపుతోంది. జిబ్రాన్ నేపధ్య సంగీతంతో పాటు ఒకనాటి ఇళయరాజా క్లాసిక్............

Kalyan Ram : నెగిటివిటీ వర్కవుట్ అవుతుందంటున్న కళ్యాణ్ రామ్..

Kalyan Ram fans gets new sentiment for Amigos Movie

Kalyan Ram :  అతనొక్కడే, పటాస్ సినిమాలు ఇటీవల బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్ కు మంచి బూస్టప్ నిచ్చాయి. వీటిలో అతడు హీరోగా నటించినప్పటికీ ఆ పాత్రల్లో నెగెటివిటీ కోణం ఉంటుంది. ఇప్పుడు రాబోయే ‘అమిగోస్’ లో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్స్ చేస్తున్నాడు. అందులో ఒకటి నెగెటివ్ షేడ్స్ కనిపిస్తాయి. ‘బింబిసార’ మాత్రం కళ్యాణ్ రామ్‌కి కొత్త ఊపిరి నిచ్చింది. అతనికి ‘బింబిసార’ సాలిడ్ హిట్‌ని ఇవ్వడమే కాకుండా మరికొంత కాలం పాటు కెరీర్ కొనసాగేలా మంచి మైలేజ్ ఇచ్చింది. అయితే ఆ హిట్ మూవీస్ లో ఒక కామన్ పాయింట్ ఉంది.

‘అతనొక్కడే’ మూవీ ఫస్టాఫ్ లో అందరినీ చంపుకుంటూ వెళుతూ ఓ నెగెటివ్ అపీరెన్స్ ఇస్తాడు. ‘పటాస్’ లో కూడా పోలీస్ వేషంలో విలన్స్ ను సపోర్ట్ చేస్తుంటాడు. దానికి కూడా నెగెటివ్ టచ్ ఉంటుంది. ఇక ‘బింబిసార’ లో అయితే డ్యూయల్ రోల్స్ లో ఒక పాత్ర ఫస్టాఫ్ మొత్తం విలనిజంతోనే ఎలివేట్ అవుతుంది. ఇక లేటెస్ట్ గా రాబోతున్న అమిగోస్ లో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్స్ చేస్తున్నాడు. ఈ మూడు పాత్రల్లోనూ ఒకటి నెగెటివ్ రోల్ అవ్వడం విశేషం. దీంతో కళ్యాణ్ రామ్ నెగిటివిటీ ఉన్న రోల్స్ చేస్తే ఆ సినిమా హిట్ అవుతుందని అంటూ ఓ కొత్త సెంటిమెంట్ ని తీసుకొచ్చారు.

Unstoppable : పవన్ అన్‌స్టాపబుల్ 2 ప్రోమో.. పక్కా పొలిటికల్ ఎపిసోడ్.. ఏపీలో పొలిటికల్ హీట్ ఖాయం..

ఫిబ్రవరి 10న ‘అమిగోస్’ రిలీజ్ కు రెడీ అయింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో అమిగోస్ ని నిర్మించారు. మూడు షేడ్స్ లో కళ్యాణ్ రామ్ కొత్తగా ఉండగా కంప్లీట్ నెగటివ్ క్యారెక్టర్ చేయడం ఆసక్తి రేపుతోంది. జిబ్రాన్ నేపధ్య సంగీతంతో పాటు ఒకనాటి ఇళయరాజా క్లాసిక్ ఎన్నో రాత్రులొస్తాయి పాట రీమిక్స్ ఆల్రెడీ హిట్ ఛార్ట్స్ ఎక్కేసింది. మొత్తానికి అంచనాలు పెంచేలా ఉన్న అమిగోస్ యాక్షన్ లవర్స్ కి మంచి ట్రీట్ ఇచ్చేలానే ఉంది. మరి దీనికి కూడా కళ్యాణ్ రామ్ నెగెటివిటీ వర్కౌట్ అయి సినిమా హిట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. బింబిసార సినిమాతో ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో కూడా హిట్ కొట్టి సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడని భావిస్తున్నారు అంతా.