NTR30 : ఎన్టీఆర్ బర్త్ డేకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. ‘దేవర’గా ఎన్టీఆర్ విశ్వరూపమే..

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ NTR30 ఫస్ట్ లుక్ ని బర్త్ డే కానుకగా కళ్యాణ్ రామ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

NTR30 : ఎన్టీఆర్ బర్త్ డేకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. ‘దేవర’గా ఎన్టీఆర్ విశ్వరూపమే..

Kalyan Ram releases NTR first look from ntr30

Devara : నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం NTR30. RRR తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలన్ గా నటిస్తున్నాడు. NTR30 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా నేడు (మే 19) రిలీజ్ చేశారు.

Khammam NTR Statue : ఖమ్మంలో శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్ టీఆర్ విగ్రహంలో మార్పులు

ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల అంచనాలకు మించి ఉండడం, టైటిల్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ మూవీ టైటిల్ పై నిర్మాత బండ్ల గణేష్ సంచలన ట్వీట్స్ చేశాడు. దేవర టైటిల్ తనదని, తను రిజిస్ట్రేషన్ చేయించుకున్న టైటిల్ ని మర్చిపోవడం వల్ల ఇప్పుడు ఆ టైటిల్ ని కొట్టేశారని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేసిన మరో గంటకి.. “ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే. కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్స్ వైరల్ అవుతుంది.

NTR – Ram Charan : జపాన్ టాప్ మ్యాగజైన్ పై ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫోటోలు..

ఈ సినిమాకి తమిళ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ చిత్ర యూనిట్ ఈ మూవీకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసేశారు. తాజాగా మూడో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రత్యేక సెట్ లో ఈ షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. సుమారు 10 రోజులు పాటు ఈ షెడ్యూల్ జరగనుంది అని సమాచారం. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు కోసం కొరటాల హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దించాడు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ కానున్నాయి అని తెలుస్తుంది.