The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’లో ఎంట్రీ ఇచ్చిన కాంతార భామ!

కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా సప్తమి గౌడ నటించగా, ఆమెకు ఈ సినిమాతో మంచి పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాలో లేడీ కానిస్టేబుల్ పాత్రలో సప్తమి గౌడ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.

The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’లో ఎంట్రీ ఇచ్చిన కాంతార భామ!

Kantara Fame Sapthami Gowda Joins The Vaccine War

The Vaccine War: కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా సప్తమి గౌడ నటించగా, ఆమెకు ఈ సినిమాతో మంచి పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాలో లేడీ కానిస్టేబుల్ పాత్రలో సప్తమి గౌడ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.

Vaccine War : వ్యాక్సిన్ వార్ : కరోనా వ్యాక్సిన్లపై ప్రపంచ దేశాల మధ్య కొత్త రగడ

ఇక ఈ బ్యూటీకి కాంతార సక్సెస్ తరువాత పలు క్రేజీ ప్రాజెక్టులు వస్తున్నట్లు కన్నడ వర్గాలు తెలిపాయి. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ, ఓ భారీ ప్రాజెక్టులో ఈ బ్యూటీ ఛాన్స్ పట్టేసింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’లో సప్తమి గౌడ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఇప్పుడు ‘ది వ్యాక్సిన్ వార్’ మూవీతోనూ అలాంటి సక్సెస్ రిపీట్ చేయాలని వివేక్ అగ్నిహోత్రి అండ్ టీమ్ తెగ ప్రయత్నిస్తున్నారు. మరి ఈ సినిమాతో సప్తమి గౌడ ఎలాంటి గుర్తింపును తెచ్చుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.