Kantara: కాంతార వచ్చేస్తోంది.. ఎక్కడో తెలుసా..?

కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో మనం చూశాం. కేవలం రీజినల్ సినిమాగా వచ్చిన కాంతార, ఆ తరువాత ఇతర భాషల్లోనూ డబ్ కావడం, ఆ తరువాత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపడం చకచకా జరిగిపోయాయి. ఈ సినిమాను హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

Kantara: కాంతార వచ్చేస్తోంది.. ఎక్కడో తెలుసా..?

Kantara Movie World Television Premiere On The Way

Kantara: కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో మనం చూశాం. కేవలం రీజినల్ సినిమాగా వచ్చిన కాంతార, ఆ తరువాత ఇతర భాషల్లోనూ డబ్ కావడం, ఆ తరువాత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపడం చకచకా జరిగిపోయాయి. ఈ సినిమాను హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

Kantara : సర్‌ప్రైజ్.. ఆస్కార్ క్వాలిఫికేషన్స్ లిస్ట్ లో కాంతార.. రెండు విభాగాల్లో పోటీకి..

ఈ సినిమాలో కాన్సెప్ట్, సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉండటంతో ఈ మూవీని డిజిటల్ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా కాంతార ఆస్కార్ అవార్డులకు క్వాలిఫై కావడంతో చిత్ర యూనిట్ సంతోషంలో మునిగితేలుతుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యింది.

Kantara: సెంచరీ కొట్టిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ మూవీ!

కాంతార చిత్ర తెలుగు శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా సొంతం చేసుకుంది. ఈ సినిమాను త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేసేందుకు స్టార్ మా రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాను ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారనే విషయంపై మాత్రం స్టార్ మా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.