Kartiki Gonsalves : ది ఎలిఫెంట్ విష్పరర్స్ డైరెక్టర్‌కి.. కోటి రూపాయల నజరానా అందించిన తమిళనాడు సీఎం స్టాలిన్..
ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్ ఇటీవలే ఇండియాకు తిరిగివచ్చింది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ ని కలిసి ఆస్కార్ అవార్డుని చూపించింది. గతంలోనే వీరికి ఆస్కార్ వచ్చినప్పుడే సీఎం స్టాలిన్..............

Kartiki Gonsalves felicitate by Tamilanadu CM Stalin and she received one crore rupees
Kartiki Gonsalves : 95వ ఆస్కార్ వేడుకల్లో మన ఇండియా నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డులు గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండూ ఆస్కార్ సాధించడంతో భారతదేశం నుంచి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఈ రెండు టీమ్స్ కి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వచ్చాయి. ఇక ఆస్కార్ సంబరాలు అయ్యాక రెండు టీమ్స్ ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ కూడా సంబరాలు చేసుకున్నారు.
ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్ ఇటీవలే ఇండియాకు తిరిగివచ్చింది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ ని కలిసి ఆస్కార్ అవార్డుని చూపించింది. గతంలోనే వీరికి ఆస్కార్ వచ్చినప్పుడే సీఎం స్టాలిన్ ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా డైరెక్టర్, నిర్మాత తమిళ్ వాళ్ళు కావడంతో వీరికి కోటి రూపాయాల బహుమతిని ప్రకటించారు. దీంతో తాజాగా ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా డైరెక్టర్ కార్తికి గోన్సాల్వేస్ మంగళవారం నాడు సీఎం స్టాలిన్ ని కలవగా ఆయన సన్మానించి కోటి రూపాయల చెక్కుని అందచేశారు.
అలాగే అవార్డు ప్రకటించినప్పుడే సినిమాలో నటించిన నిజమైన ఏనుగు సంరక్షకులు బొమ్మన్, బెల్లిలను కూడా సీఎం స్టాలిన్ సన్మానించారు. ఆ ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా నిధులు కూడా విడుదల చేశారు. దీంతో తమిళనాడు ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ప్రజలు, నెటిజన్లు అభినందిస్తున్నారు.
Tamil Nadu Government announces cash prize of Rs.1Crore to Kartiki Gonsalves, the director of Oscar-winning short documentary feature #TheElephantWhisperers 👏👏👏
— Christopher Kanagaraj (@Chrissuccess) March 21, 2023
ஊட்டியில் வளர்ந்து, நம் தமிழ்நாடு அரசின் யானைப் பாதுகாப்பு முயற்சிகளை #AcademyAwards வரை கொண்டுசென்ற #TheElephantWhisperers இயக்குநர் @earthspectrum அவர்களைப் பாராட்டி ஊக்கத்தொகையாக ரூ.1 கோடி வழங்கினேன்.
முகம்தெரியாத பலரின் உழைப்பைத் தம் படைப்பால் உலகறியச் செய்ததற்குப் பாராட்டு! pic.twitter.com/LNZZP0Jjns
— M.K.Stalin (@mkstalin) March 21, 2023