Keerthy Suresh Marriage : పెళ్లి వార్త‌ల‌పై కీర్తి సురేష్‌ క్లారిటీ

ఇప్పుడు కీర్తి సురేష్ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే.. కొన్నాళ్లుగా కీర్తి సురేష్ పెళ్లిపై అనేక రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. అయితే, కీర్తి వాటిని కొట్టిపారేస్తూ వ‌స్తూనే ఉంది. తాజాగా మరో ప్రచారం మొదలైంది. కీర్తి వివాహానికి రెడీ అయిందని, చెన్నైకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనుందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Keerthy Suresh Marriage : పెళ్లి వార్త‌ల‌పై కీర్తి సురేష్‌ క్లారిటీ

Keerthy Suresh Marriage

Keerthy Suresh Marriage : ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి కీర్తి సురేష్. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాటలో యాక్ట్ చేస్తోంది.

ఇప్పుడు కీర్తి సురేష్ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే.. కొన్నాళ్లుగా కీర్తి సురేష్ పెళ్లిపై అనేక రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. అయితే, కీర్తి వాటిని కొట్టిపారేస్తూ వ‌స్తూనే ఉంది. తాజాగా మరో ప్రచారం మొదలైంది. కీర్తి వివాహానికి రెడీ అయిందని, చెన్నైకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనుందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆ ప్రచారానికి చెక్ పెడుతూ కీర్తి సురేష్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. అసలు తనకు పెళ్లి ఆలోచనే లేదని, తన దృష్టి అంతా సినిమాల మీదే అని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకోవాల‌ని అనిపిస్తే, అబ్బాయి ఫైన‌ల్ అయ్యాక అంద‌రి కంటే ముందు ఆ వార్త తానే చెబుతానని కీర్తి సురేష్‌ అంది. కాగా, కీర్తి సురేష్ అనిరుధ్ రవిచంద్ర‌న్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. కీర్తి సురేష్ ప్రస్తుతం పరుశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.