తెలుగులో పది కోట్లు కొల్లగొట్టింది

కె.జి.ఎఫ్. 17రోజుల రెండు రాష్ట్రాల కలెక్షన్స్

  • Published By: sekhar ,Published On : January 7, 2019 / 10:15 AM IST
తెలుగులో పది కోట్లు కొల్లగొట్టింది

కె.జి.ఎఫ్. 17రోజుల రెండు రాష్ట్రాల కలెక్షన్స్

కన్నడ రాకింగ్ స్టార్ యశ్, శ్రినిధి శెట్టి జంటగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందిన కె.జి.ఎఫ్. మూవీ, డిసెంబర్ 21న కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. కంటెంట్ మరీ కొత్తదేం కాకపోయినా, హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ, ఆడియన్స్ ఇంతకుముందెప్పుడూ స్ర్కీన్‌పై చూడని బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కడంతో, కన్నడతో సహా అన్ని చోట్లా, మౌత్‌టాక్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది.

మథర్ సెంటిమెంట్, ఒళ్ళు గగుర్పొడిచే ఫైట్స్, యశ్ నటనకి సలాం రాకీ భాయ్ అంటూ, మాస్ ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ కె.జి.ఎఫ్ మూవీని చూస్తున్నారు. మూడో వారంలోకి ఎంటర్ అయ్యాక కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, చెప్పుకోదగ్గ కలెక్షన్స్‌లతో అదరగొడుతుంది కె.జి.ఎఫ్. తెలుగు వెర్షన్, 17రోజుల్లో ఎంత మేర వసూళ్ళు రాబట్టిందనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
నైజాం : రూ. 4.13కోట్లు, సీడెడ్ : 1.96కోట్లు, ఉత్తరాంధ్ర : 1.19కోట్లు, ఈస్ట్ : 0.62కోట్లు, వెస్ట్ : 0.48కోట్లు, కృష్ణ : 0.90కోట్లు, గుంటూరు : 0.75కోట్లు, ఏపీ, తెలంగాణా : రూ.10.29కోట్లు (డిస్ట్రిబ్యూటర్ షేర్). ఓవరాల్‌గా కె.జి.ఎఫ్. షేర్, రూ.20కోట్లకి దగ్గర్లో ఉందని తెలుస్తుంది. సంక్రాంతి సినిమాల రాకతో, జనవరి 8నుండి ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు పూర్తవుతుంది.

వాచ్ ట్రైలర్…