ఖైదీ – రివ్యూ

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో నటించిన ‘ఖైదీ’ దీపావళి కానుకగా తెలుగు, తమిళ్‌లో భారీగా విడదలైంది..

  • Published By: sekhar ,Published On : October 25, 2019 / 11:04 AM IST
ఖైదీ – రివ్యూ

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో నటించిన ‘ఖైదీ’ దీపావళి కానుకగా తెలుగు, తమిళ్‌లో భారీగా విడదలైంది..

హీరో కార్తి ‘దేవ్’ సినిమా డిజాస్టర్‌తో ఎలాగైనా హిట్ కొట్టాలని ‘ఖైదీ’ సినిమాను ఎంచుకున్నాడు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. సినిమా 2019, అక్టోబర్ 25 శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. కార్తీకి ఈ సినిమా హిట్ ఇచ్చిందా లేక మరో డిజప్పాయింట్ మూవీ అయ్యిందా అనేది  ఇప్పుడు చూద్దాం..

కథ విషయానికి వస్తే : జైల్లో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న ‘ఢిల్లీ’ అనే ఖైదీ తన జీవితంలో మొదటిసారి తన కూతురుని చూడటానికి ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత అనుమతి వస్తోంది. ఎంతో ఆశతో జైలు నుండి బయటకు వస్తాడు. కూతురిని కలవడానికి వెళ్తుండగా మధ్యలో అనుకోకుండా అతనికి పోలీసుల ప్రాణాలనే కాపాడాల్సిన పరిస్థితి వస్తోంది. మొదట్లో అతను అంగీకరించకపోయినా చివరికి కూతురు భవిష్యత్తు కోసం ఆ పనికి పూనుకుంటాడు. అసలు పోలీసులకు ‘ఢిల్లీ’ సహాయం తీసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయి..‘ఢిల్లీ’ వాళ్ళను సేవ్ చేశాడా ? సేవ్ చేసే క్రమంలో ఎలాంటి సంఘటనలు, అవరోధాలు ఎదుర్కొన్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Read Also : ‘విజిల్’ – రివ్యూ

నటీనటుల విషయానికి వస్తే : కార్తీ ‘ఖైదీ’ పాత్రలో అద్భుతంగా నటించారు. క్లిష్టమైన సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే హైలెట్. కూతురిపై ప్రేమను వ్యక్త పరిచే సన్నివేశంలో.. అలాగే గతం వివరించే సీన్‌లో.. కూతుర్ని కలుసుకునే సీన్‌లో కార్తీ నటన ఎమోషనల్‌గా ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది. అయితే కమర్షియల్‌ సినిమా అనగానే ముందుగా హీరోయిన్, సాంగ్స్, కామెడీ లీడ్ రోల్స్‌లో ఉంటుంది. ఈ సినిమాలో అవి లేకపోయినా.. వాటికి మించిన కథ, బలమైన ఎమోషన్, ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్‌గా నరేన్ నటన ఆకట్టుకుంది. ఇక కార్తీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు

టెక్నీషియన్స్ విషయానికి వస్తే : దర్శకుడు లోకేష్ మంచి సినిమా తీశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీసి ఉంటే.. కమర్షియల్‌గా మరో స్థాయిలో ఉండేది. కెమెరామెన్ సత్యన్ సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్‌. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్‌లో యాక్షన్ సన్నివేశాల్లో మూడ్‌ని తన కెమెరా యాంగిల్స్‌తో కళ్ళకు కట్టినట్టు చూపించారు. అలాగే శ్యామ్ సీఎస్ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. హీరో తన కూతురు కోసం ఎంతగా పరితపిస్తున్నాడో.. తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఆ సీన్‌కు ఫీల్ తీసుకువచ్చాడు. ఎడిటింగ్ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి..

ఓవరాల్‌గా చెప్పాలంటే..

భిన్నమైన కథనంతో వైవిధ్యంగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమా బలమైన యాక్షన్ అండ్ ఎమోషన్‌తో పాటు కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగుతూ ఆకట్టుకుంది. కార్తీ పర్ఫామెన్స్‌తో పాటు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వ పనితనం కూడా సినిమా స్థాయిని పెంచాయి. తెలుగులో గట్టి పోటీ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.