Kiara-Sidharth : భర్త సిద్దార్థ్ గురించి కియారా ఏం చెప్పిందో తెలుసా?

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కియారా అద్వానీ లాస్ట్ ఇయర్ వచ్చిన హిట్స్ గురించి మాట్లాడింది. అదే సమయంలో మ్యారేజ్ అయ్యాకా తన లైఫ్ ఎలా ఛేంజ్ అయింది అన్న విషయాన్ని రివీల్ చేసింది. కియారా మాటలాడుతూ................

Kiara-Sidharth : భర్త సిద్దార్థ్ గురించి కియారా ఏం చెప్పిందో తెలుసా?

Kiara Advani Praising her Husband Sidharth Malhotra

Kiara-Sidharth :  బాలీవుడ్ క్రేజీ కపుల్ కియరా అద్వానీ, సిద్ధార్ధ్ మల్హోత్రా ఫిబ్రవరి 6న రాజస్థాన్ లోని జైసల్మీర్ లోని ఒక హోటల్ లో గ్రాండ్ గా పెళ్ళి చేసుకున్నారు. బాలీవుడ్ సినీ ప్రముఖులు, బంధు మిత్రుల సమక్షంలో ఇద్దరూ ఒకటయ్యారు. వీరి పెళ్ళిఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నెల రోజులూ ఈ న్యూ మ్యారీడ్ కపుల్ ఫుల్ గా ఎంజాయ్ చేసి ఇటీవలే బ్యాక్ టు వర్క్ కి వచ్చారు. తాజాగా తన భర్త సిద్దార్ధ్ మల్హోత్రా బంగారం అంటూ కియారా కితాబు ఇచ్చింది.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కియారా అద్వానీ లాస్ట్ ఇయర్ వచ్చిన హిట్స్ గురించి మాట్లాడింది. అదే సమయంలో మ్యారేజ్ అయ్యాకా తన లైఫ్ ఎలా ఛేంజ్ అయింది అన్న విషయాన్ని రివీల్ చేసింది. కియారా మాటలాడుతూ.. మొట్టమొదటి సారిగా నేనొక ఇంటిని నిర్వహిస్తున్నారు. నిన్న మొన్నటివరకూ మా పేరేంట్స్ ఇంట్లో ఉండేదాన్ని. ఆ అమ్మ ఇంటి బాధ్యలు తీసుకుంది. మా నాన్న కావల్సినవన్నీ సమకూర్చేవారు. అందుకే ఇద్దరికీ ఎంతో గౌరవాన్ని ఇస్తాను. నా జీవితంలో అది ఎంతో అందమైన అంశం. అందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని ఇంటిని నిర్వహిస్తున్నాను అని చెప్పింది.

Rana Naidu : ఒకరోజు ముందే ఫ్రీగా రానా నాయుడు ప్రీమియర్స్.. కానీ వాళ్లకే..

అనంతరం తన భర్త సిద్దార్ధ్ మల్హోత్రాను పొగిడేసింది. సిద్దార్థ్ గురించి చెప్తూ.. అతడు గొప్ప లైఫ్ పార్టనర్. కొత్త కొత్త విషయాల వైపు నన్ను ఎప్పుడూ మోటివేట్ చేస్తాడు. చాలా మొండి ధైర్యం కలవాడు. ఏదైనా సాధించాలన్న తపన ఉన్నవాడు. దాన్నే నాకు కూడా నేర్పించాడు. మా ఇద్దరి పెయిర్ ను అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. షేర్షా లో మేమిద్దరం చేసిన లాంటి పాత్రలతోనే మరో సినిమా చేస్తాను. అలంటి మంచి స్క్రిప్ట్ తీసుకొస్తే నేను, సిద్దార్థ్ కచ్చితంగా నటిస్తాం. మా ఆయన గురించి ఎలాంటి కంప్లైంట్స్ లేవు. మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము అని తెలిపింది.