కమెడియన్ కొడుకు హీరోగా సినిమా: అక్టోబర్ 18న విడుదల

  • Published By: vamsi ,Published On : September 22, 2019 / 11:06 AM IST
కమెడియన్ కొడుకు హీరోగా సినిమా: అక్టోబర్ 18న విడుదల

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై తెరకెక్కిన సినిమా ‘కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్’‌. యువ దర్శకుడు శ్రీనాథ్ పుల‌కురం ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఎల్సాగోష్‌ హీరోయిన్ గా నటించగా.. ఇప్పటికే విడుదలైన టీజర్ కు  మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాను అక్టోబర్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీ‌నాథ్‌ పుల‌కుర‌ం మాట్లాడుతూ.. ‘కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ అనే సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ అని, థ్రిల్లర్ కథలకు మంచి ఆదరణ లభిస్తుందని, దీంతో కృష్ణారావ్ సూపర్ మార్కెట్ సినిమాపై అందరూ నమ్మకంగా ఉన్నట్లు చెప్పారు. కథ మొత్తం కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ చుట్టూనే నడుస్తుంది అని, అందుకే సినిమాకు ఈ టైటిల్ పెట్టినట్లు చెప్పారు.

హీరో కృష్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని, ఈ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చి పెడుతుందని అన్నారు. హీరోయిన్ ఎల్సా కూడా బాగా న‌టించిందని, ఇద్దరు డేడికేషన్‌ ఉన్న నటులు అని దర్శకుడు శ్రీనాథ్ అన్నారు. బోలే ష‌వాలీ అందించిన సంగీతం సినిమాకు బాగా కలిసి వచ్చిందని అన్నారు.