Krishnam Raju Last Rites : కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం.. అంత్యక్రియలు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ చేతులమీదుగా..

హీరో కృష్ణంరాజు అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఆయన ఫామ్ హౌస్ లో నేడు మధ్యాహ్నం జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకి కృష్ణంరాజు ఇంటివద్ద నుంచి ఆయన పార్థివదేహాన్ని అంతిమయాత్రగా...........

Krishnam Raju Last Rites : కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం.. అంత్యక్రియలు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ చేతులమీదుగా..

Krishnam Raju Last Rites

Updated On : September 12, 2022 / 1:33 PM IST

Krishnam Raju Last Rites :  నటుడు, రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం టాలీవుడ్ లో విషాదం మిగిల్చింది. ప్రభాస్ కి తీరని లోటుని ఏర్పరిచింది. సినీ, రాజకీయ ప్రముఖులంతా తరలివచ్చి కృష్ణంరాజుకి నివాళులు అర్పించారు. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కృష్ణంరాజు గారి పార్థివదేహం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 28లోని ఆయన ఇంటి వద్ద నేడు మధ్యాహ్నం వరకు ఉంచారు.

హీరో కృష్ణంరాజు అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఆయన ఫామ్ హౌస్ లో నేడు మధ్యాహ్నం జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకి కృష్ణంరాజు ఇంటివద్ద నుంచి ఆయన పార్థివదేహాన్ని అంతిమయాత్రగా మొయినాబాద్ కి తీసుకెళ్తున్నారు. అధికార లాంఛనాలతో ఈ అంతిమయాత్ర కొనసాగుతుంది.

Krishnam Raju with Other Heros : 50 మల్టీస్టారర్ సినిమాలు.. ఎక్కువమందితో కలిసి చేసిన హీరో.. ఆయన రూటే సపరేట్..

మధ్యాహ్నం కనకమామిడిలోని ఆయన ఫామ్ హౌస్ లో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజుకి మగ పిల్లలు లేకపోవడంతో ప్రభాస్ అన్నయ్య అయిన ప్రబోధ్ చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.