Siva Shankar Master: కరోనాతో శివశంకర్ మాస్టర్ కన్నుమూత

కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్‌ మాస్టర్‌ కన్నుమూశారు.

Siva Shankar Master: కరోనాతో శివశంకర్ మాస్టర్ కన్నుమూత

Shiva

Siva Shankar Master: కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్‌ మాస్టర్‌(73) కన్నుమూశారు. కరోనా సోకిన తర్వాత హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ(28 నవంబర్ 2021) కన్నుమూశారు. ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా సోకడంతో కాపాడలేకపోయారు వైద్యులు. శివ శంకర్‌ మాస్టర్‌ తెలుగు, తమిళ భాషల్లోని పలు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్‌ అవార్డు అందుకున్నారు.

మగధీర సినిమాలో ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో శివశంకర్ మాస్టర్‌కు జాతీయ పురస్కారం లభించింది. డ్యాన్స్‌ మాస్టర్‌గానే కాకుండా సుమారు 30 చిత్రాల్లో నటించారు శివశంకర్. టీవీల్లో డాన్స్ షోలకు జడ్జ్‌గానూ వ్యవహరించారు మాస్టర్. ఇటీవల మాస్టర్ కుటుంబం కరోనా బారినపడగా.. శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కూడా కరోనాతో పోరాడుతున్నారు. విజయ్ శివశంకర్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు డాక్టర్లు.

House Collapsed : బాబోయ్.. కళ్లముందే కూలిన ఇల్లు.. కడప జిల్లాలో వర్ష బీభత్సం..

చెనైలో 7 డిసెంబర్ 1948లో పుట్టిన శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి. 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా పనిచేసిన శివశంకర్ మాస్టర్. భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల్లో చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు. 800కు పైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. శివశంకర్ మాస్టర్ తెలుగులో అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు.

శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు. చిన్న కుమారుడు అజయ్ కృష్ణే తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు.

AP : బిగ్ న్యూస్…ఏకమైన నాయకులు…ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల కీలక నిర్ణయం