మాజీ ఎంపీకి ముచ్చెమటలు పట్టించిన నటి

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావుని బెదిరించిన నటి లీనా..

  • Published By: sekhar ,Published On : June 17, 2020 / 10:12 AM IST
మాజీ ఎంపీకి ముచ్చెమటలు పట్టించిన నటి

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావుని బెదిరించిన నటి లీనా..

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావుకి ఓ నటి ఫోన్లో ముచ్చెమటలు పట్టించింది. ఆమె ఎవరో కాదు మలయాళంలో వివాదాస్పద నటిగా పేరొందడంతో పాటు నేర చరిత్ర కలిగిన లీనా మరియా పాల్.. గ‌తంలో లీనా కేరళలో ఓ బ్యాంకును మోసం చేసి రూ.19 కోట్లకు కుచ్చుటోపి పెట్టింది. అప్పుడు ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. తర్వాత కొన్ని వివాదాల్లో ఇరుక్కుంది. అయినప్ప‌టికీ ప్ర‌వ‌ర్త‌న మార్చుకోని లీనా తాజాగా మ‌రోసారి రాయ‌పాటి విష‌యంలో జైలుకెళ్లే అవకాశముందని తెలుస్తోంది.

వివరాళ్లోకి వెళ్తే.. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ఈమధ్య ఓ ఫోన్ కాల్ వ‌చ్చింది. ‘సీబీఐ నుండి కాల్ చేస్తున్నాం. మేం అడిగిన మొత్తం ఇస్తే మీ మీద ఉన్న కేసుల‌న్నీ మాఫీ చేస్తాం.. ఇక మీరు హాయిగా రిలాక్స్ అవ్వొచ్చు’ అంటూ ఓ లేడీ ఫోన్‌లో మాట్లాడింది. స‌ద‌రు ఫోన్ కాల్‌పై అనుమానం రావడంతో రాయ‌పాటి సీబీఐకి ఫిర్యాదు చేశారు.

Leena Maria Paul

ఎంక్వైరీలో లీనా తన గ్యాంగ్‌తో కలిసి ఆ కాల్ చేసింది అని తేలింది. గత అనుభవం దృష్ట్యా అరెస్ట్ అయ్యే అవకాశముందని భావించిన లీనా హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకుంది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన మలయాళ సినిమా ‘రెడ్ చిల్లీస్’(2009) తో నటిగా ఎంట్రీ ఇచ్చింది లీనా.  

Read: ‘ఆహా’లో అదిరిపోయే సినిమాలు..