Vijay-Ananya: రౌడీ హీరో కాదు పిరికివాడు.. విజయ్‌పై అనన్య కామెంట్స్!

విజయ్ దేవరకొండ.. ప్రజెంట్ హాట్ హాట్ సేలబుల్ హీరో. తెలుగు నుంచి హిందీ వరకూ అందరూ ఫిదా అయిపోతున్న హీరో. ఈ రౌడీ హీరోనే అంటే ఇస్తామంటూ సీనియర్ హీరోయిన్స్ నుండి అప్ కమింగ్..

Vijay-Ananya: రౌడీ హీరో కాదు పిరికివాడు.. విజయ్‌పై అనన్య కామెంట్స్!

Vijay Ananya

Vijay-Ananya: విజయ్ దేవరకొండ.. ప్రజెంట్ హాట్ హాట్ సేలబుల్ హీరో. తెలుగు నుంచి హిందీ వరకూ అందరూ ఫిదా అయిపోతున్న హీరో. ఈ రౌడీ హీరోనే అంటే ఇస్తామంటూ సీనియర్ హీరోయిన్స్ నుండి అప్ కమింగ్ హీరోల వరకు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు కొందరు విజయ్ తో పనిచేసే ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని కూడా వెయిట్ చేస్తున్నారు. అంతగా అమ్మాయిల మనసులలో దూరిపోయాడు వీడీ.

Liger : భారీ ధరకు అమ్ముడైన ‘లైగర్’ డిజిటల్ రైట్స్

విజయ్ ఆటిట్యూడ్, మాట తీరు, అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ తో అతనికి రౌడీ హీరో అనే బ్రాండ్ వేశారు. అయితే.. విజయ్ అంత రౌడీ ఏం కాదని.. ఇంకా చెప్పాలంటే విజయ్ చాలా పిరికివాడని షాకింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే. విజయ్, అనన్య ప్రస్తుతం ‘లైగర్‌’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈమూవీ నిర్మాంతర కార్యక్రమాలను కూడా జరుపుకుంటోంది. ఇప్పటికే హిందీలో ప్రమోషన్ కూడా మొదలు పెట్టిన టీమ్ ఇంటర్వూలు కూడా ఇస్తుంది.

Liger: విజయ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. లైగర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

తాజాగా విజయ్‌, అనన్య పాండేలు ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సందర్భంగా అనన్య, విజయ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విజయ్‌ బెస్ట్‌ కో-స్టార్‌ అని.. అయితే ‘సినిమాలో కనిపించేదాని కన్నా విజయం బయట చాలా భిన్నంగా ఉంటాడు. ఒక్కసారి అతడిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సినిమాల్లో అతడి పాత్రలన్ని ధైర్యవంతంగా ఉంటాయి. కానీ బయటక మాత్రం విజయ్‌ పిరికివాడు’ అంటూ చెప్పకొచ్చింది. కానీ విజయ్‌ ఒక కో-స్టార్‌ నుంచి ఎలాంటి కంఫర్ట్స్‌ ఉండాలనుకుంటామో అవి విజయ్‌ దగ్గర ఉంటాయని చెప్పింది.