‘సలార్’కి విలన్ ఇతనే..

‘సలార్’కి విలన్ ఇతనే..

Madhu Guruswamy: రెబల్ స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో యావత్ సినీ ప్రపంచం చూపు కన్నడ పరిశ్రమ వైపు తిప్పిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.

డార్లింగ్‌కి జోడీగా శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్ర ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి చెయ్యబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘సలార్’ కి విలన్‌ ఫిక్స్ అయిపోయారు. కన్నడలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మధు గురుస్వామి ఈ చిత్రంలో విలన్ వేషం వేస్తున్నారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారాయన. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘సాక్ష్యం’ సినిమాలో జగపతి బాబు తమ్ముడిగా నటించారు మధు గురుస్వామి.
ఈ మూవీలో తెలుగు, తమిళ్, కన్నడ భాషలకు చెందిన చాలా మంది కొత్త వాళ్లు నటిస్తున్నారు. 2022 సంక్రాంతికి ‘సలార్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు యూనిట్.

 

 

View this post on Instagram

 

A post shared by Madhuguruswamy (@madhuguruswamy86)