Mahesh Babu: ఫస్ట్ షెడ్యూల్ ముగించేసిన మహేష్.. ఇక దసరా తరువాతే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అప్పుడే తారాస్థాయికి చేరుకున్నాయి.ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా ముగించుకుంది.

Mahesh Babu: ఫస్ట్ షెడ్యూల్ ముగించేసిన మహేష్.. ఇక దసరా తరువాతే!

Mahesh Babu Completes SSMB28 First Schedule

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అప్పుడే తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ఇప్పటికీ టీవీల్లో ప్రేక్షకులను అలరిస్తుండటంతో, వీరిద్దరు మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

SSMB28: మహేష్ సినిమాకు ఆ టైటిల్ అయితేనే బెస్ట్ అంటోన్న ఫ్యాన్స్!

ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. ఈ సీక్వెన్స్‌లో మహేష్ అల్ట్రా యాక్షన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పూర్తి లుక్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా ముగించుకుంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు.

SSMB28: మహేష్ త్రివిక్రమ్‌ల “SSMB28” రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన మూవీ మేకర్స్!

ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను దసరా తరువాత ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రెండో షెడ్యూల్‌లో మహేష్ బాబుతో పాటు అందాల భామ పూజా హెగ్డే కూడా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.