ఆపమ్మా.. ఎప్పుడూ ఇదే పనా – ఫోటోగ్రాఫర్‌పై మహేష్ పంచ్‌లు

ఎయిర్ పోర్టులో ఫోటోగ్రాఫర్‌పై పంచులేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

10TV Telugu News

ఎయిర్ పోర్టులో ఫోటోగ్రాఫర్‌పై పంచులేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

‘ఆపమ్మా ఆపు.. నీకు బోర్ కొట్టట్లా.. ఎప్పుడూ ఇదే పనా’.. అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్టైల్‌లో ఓ ఫోటోగ్రాఫర్‌పై పంచేలేశాడు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవడంతో మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్లాడు. విజయ నిర్మల జయంతి సందర్భంగా ఆమె విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసాడు. తిరిగి అమెరికా పయనమయ్యాడు మహేష్.

ఎయిపోర్టులో మహేష్  కారు దిగినప్పటినుండీ ఓ ఫోటోగ్రాఫర్ అదేపనిగా ఫోటోలు తీస్తున్నాడు. వీడియోలో కూడా ఫోటో క్లిక్ చేస్తున్న శబ్ధాలే ఎక్కువ వినబడుతున్నాయి. ఇది గమనించిన మహేష్.. ఆ ఫోటోగ్రాఫర్‌‌తో ‘ఆపమ్మా కొంచెం సేపు.. నీకు బోర్ కొట్టట్లా.. ఎప్పుడూ ఇదే పనా’.. అనగా.. అతను.. లేదు సార్, ఇప్పుడే వచ్చాను అంటూ బదులిచ్చాడు.

మిగతా సెలబ్రిటీల్లా చిరాకు పడకుండా సరాదాగా పంచులేస్తూ తనలోని హ్యూమర్ యాంగిల్‌ని మరోసారి బయటపెట్టాడు సూపర్ స్టార్. మహేష్ తన తర్వాతి సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. స్క్రిప్ట్ పనులు ఆలస్యమవుతుండడంతో ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి.