SSMB28 : సోషల్ మీడియాలో SSMB28 వీడియో లీక్.. మహేష్ ఎంత మాస్‌గా ఉన్నాడో చూశారా?

మహేష్ బాబు SSMB28 టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ లీక్ అయ్యిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో స్క్రీన్ షాట్స్.

SSMB28 : సోషల్ మీడియాలో SSMB28 వీడియో లీక్.. మహేష్ ఎంత మాస్‌గా ఉన్నాడో చూశారా?

Mahesh Babu SSMB28 title glimpse leaked in social media pics viral

SSMB28 First Look : ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇక ప్రతి ఏడాది ఆయన పుట్టినరోజు నాడు మహేష్ బాబు (Mahesh Babu) తన సినిమాల నుంచి ఏదొక అప్డేట్ ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది తను నటిస్తున్న SSMB28 మూవీ నుంచి టైటిల్ ని రివీల్ చేస్తామంటూ ప్రకటించాడు. కృష్ణ బర్త్ డే సందర్భంగా ఆ రోజున ఆయన సూపర్ హిట్ మూవీ ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆ సినిమా ప్రదర్శన సమయంలోనే SSMB28 టైటిల్ ని కూడా రిలీజ్ చేస్తామంటూ తెలియజేశారు.

Mem Famous Collections : మేమ్ ఫేమస్ కలెక్షన్ల జోరు.. మొదటిరోజే ఏకంగా..

ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ ని ఒక గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యినట్లు తెలుస్తుంది. ఇక ఆ వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్ పిక్ అంటూ నెట్టింట ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫొటోతో పాటు మరో పిక్ కూడా హల్ చల్ చేస్తుంది. అందులో మహేష్ లుంగీతో, ఒక చేతిలో కత్తి మరో చేతిలో బీడీతో కనిపిస్తున్నాడు. మరి ఇవి నిజంగా గ్లింప్స్ కి సంబంధించిన ఫొటోలా? లేదా ఫ్యాన్ మేడ్ ఫొటోలా? అనేది తెలియదు. ప్రస్తుతం అయితే నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

Tovino Thomas : రాజమౌళి ప్రతి ఫిలిం మేకర్‌కి స్ఫూర్తి.. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్!

కాగా ఈ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. గుంటూరు బ్యాక్‌డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రం టైటిల్స్ పై గత కొన్ని రోజులుగా మూడు పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ‘గుంటూరు కారం’, ‘అమరావతికి అటు ఇటు’, ‘ఊరుకి మొనగాడు’ టైటిల్స్ ట్రెండ్ అవుతున్నాయి. మరి వీటిలో దేనిని ఫిక్స్ చేస్తారో చూడాలి. ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.