SSMB28: మహేష్-త్రివిక్రమ్ సినిమా ఓటీటీ రైట్స్‌కు ఎంత రేటో తెలుసా..?

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లో 28వ చిత్రంగా వస్తుండగా, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు మహేష్, త్రివిక్రమ్‌లు రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
SSMB28: మహేష్ బాబు సినిమా ఓటీటీ రైట్స్‌కు భారీ రేటు..?
దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక మహేష్ కెరీర్‌లో 28వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను భారీ రేటుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ఏకంగా రూ.80 కోట్ల రేటుకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
SSMB28: నైజాం రైట్స్‌తో దుమ్ములేపిన మహేష్-త్రివిక్రమ్.. నిజమేనా..?
ఒక తెలుగు సినిమాకు ఈ రేంజ్‌లో ఓటీటీ రైట్స్ అమ్ముడవడం నిజంగా విశేషమని చెప్పాలి. కేవలం డిజిటల్ రైట్స్‌కే ఈ స్థాయిలో బిజినెస్ జరిగితే, ఇక థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్‌తో ఎంతమేర వసూళ్లు రాబడుతుందా అని సినీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండగా, త్రివిక్రమ్ ఈ సినిమాను మరింత స్టైలిష్‌గా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.