నిన్ను చూస్తే గర్వంగా ఉంది సీతూ పాప : మహేశ్ బాబు

సితార పాప ‘ఫ్రోజెన్ 2’ లో చిన్నప్పటి ఎల్సా క్యారెక్టర్‌కు వాయిస్ ఇవ్వడం గురించి సూపర్‌స్టార్ మహేష్ బాబు స్పందించారు..

  • Published By: sekhar ,Published On : November 20, 2019 / 06:06 AM IST
నిన్ను చూస్తే గర్వంగా ఉంది సీతూ పాప : మహేశ్ బాబు

సితార పాప ‘ఫ్రోజెన్ 2’ లో చిన్నప్పటి ఎల్సా క్యారెక్టర్‌కు వాయిస్ ఇవ్వడం గురించి సూపర్‌స్టార్ మహేష్ బాబు స్పందించారు..

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల పట్టీ సితార పాప సరికొత్త అవతారంలో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. 2013లో వచ్చిన పాపులర్ యానిమేటెడ్ మూవీ ‘ఫ్రోజెన్’కు సీక్వెల్‌గా.. డిస్నీ సంస్థ ‘ఫ్రోజెన్ 2’ చిత్రాన్ని నిర్మించింది. క్రిస్ బక్ అండ్ జెన్నిఫర్ లీ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో ‘ఇదియా మెజెల్’ పోషించిన ‘ఎల్సా’, ‘క్రిస్టెన్ బెల్’ చేసిన ‘అన్నా’ మెయిన్ క్యారెక్టర్స్..

ఈ పాత్రలకు హిందీలో చోప్రా సిస్టర్స్ ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా డబ్బింగ్ చెప్పారు. తెలుగులో ‘ఎల్సా’ పాత్రకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పగా.. ‘అన్నా’ పాత్రకు మహేశ్ కూతురు సితార పాప వాయిస్ ఇచ్చింది.. సితార పాప ‘ఫ్రోజెన్ 2’ లో వాయిస్ ఇవ్వడం గురించి మహేశ్ స్పందించారు.

Read Also : ‘దంగల్’ బ్యాచ్‌కి ‘పొంగల్’ బ్యాచ్‌కి ఏమైనా సెట్ అవుతాదా? : మిస్‌మ్యాచ్ – ట్రైలర్

‘కాన్ఫిడెంట్,మ్యాజికల్ అండ్ ప్యూర్‌గా ఎల్సా క్యారెక్టర్‌లో లీనమైపోయి తను వాయిస్ ఇచ్చింది.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది సీతూ పాపా.. నవంబర్ 22 వరకు ఆగలేను’ అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. ఈ మూవీ ఫస్ట్‌పార్ట్ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డు గెలుచుకుంది. ఈ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘లెట్ ఇట్ గో’ కు క్రిస్టిన్ అండర్సన్-లోపెజ్, రాబర్ట్ లోపెజ్  ఉత్తమ మ్యూజిక్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ‘ఫ్రోజెన్ 2’ నవంబర్ 22న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది..