Mahesh Babu : త్వరలో కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల పాఠశాలకు వస్తాను : మహేష్ బాబు

ఈ గొప్ప ప్రాజెక్ట్ పూర్తయ్యాక శ్రీమంతుడు టీంతో కలిసి కచ్చితంగా మీ పాఠశాలకు వస్తాం అంటూ మహేశ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Mahesh Babu : త్వరలో కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల పాఠశాలకు వస్తాను : మహేష్ బాబు

Mahesh

Mahesh Babu : ‘శ్రీమంతుడు’ సినిమా స్ఫూర్తితో ప్రముఖ వ్యాపార వేత్త, రాజకీయ నాయకుడు సుభాష్‌ రెడ్డి తన సొంత ఖర్చులతో కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు. ఈ స్కూల్‌ను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంత గొప్ప పాఠశాల నిర్మించడం మంచి విషయం, సొంత ఊరి రుణం తీర్చుకుంటున్నారు అంటూ ఈ పాఠశాల నిర్మాణం కోసం రూ. 6.5 కోట్లు వెచ్చించిన వ్యాపారవేత్త సుభాశ్‌ రెడ్డిని కేటీఆర్ అభినందించారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ హోటల్.. పీక్స్ లో కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్

‘శ్రీమంతుడు’ సినిమా స్ఫూర్తితో ఈ పాఠశాల కట్టారని సుభాష్ రెడ్డి చెప్పడంతో.. ‘శ్రీమంతుడు’ సినిమా స్పూర్తితో కట్టించారని ముందే తెలిస్తే మహేశ్‌ బాబును ఈ కార్యక్రమానికి తీసుకొచ్చేవాడిని అని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు క‌ట్టే జూనియర్ కాలేజ్ పూర్తయిన తరువాత కచ్చితంగా మహేష్ బాబుని తీసుకొస్తాను అని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమం ఫొటోస్ ట్వీట్ చేసి దీనిపై కేటీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ ప్రియాంకకి సపోర్ట్ ఇవ్వం : తెలంగాణ ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ

తాజాగా కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు స్పందించారు. కేటీఆర్‌ ట్వీట్‌కు రీట్వీట్‌ చేస్తూ.. ఈ స్కూల్ నిర్మించడానికి కారణం ‘శ్రీమంతుడు’ సినిమా అని తెలిసి ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. సుభాశ్‌ రెడ్డి గారికి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు నిజమైన హీరో. మీ లాంటి వాళ్లే మాకు కావాలి. ఈ గొప్ప ప్రాజెక్ట్ పూర్తయ్యాక శ్రీమంతుడు టీంతో కలిసి కచ్చితంగా మీ పాఠశాలకు వస్తాం అంటూ మహేశ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.