ఉప్పెన – సేతుపతి చేస్తున్నాడంటే సినిమాలో విషయం ఉన్నట్లే!

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన‘ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు..

  • Published By: sekhar ,Published On : February 11, 2020 / 05:43 AM IST
ఉప్పెన – సేతుపతి చేస్తున్నాడంటే సినిమాలో విషయం ఉన్నట్లే!

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన‘ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు..

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన‘ చిత్రంలో పాపులర్ తమిళ నటుడు ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. కృతి శెట్టి నాయికగా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ‘ఉప్పెన’ లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు.

విజయ్ సేతుపతి.. తమిళనాట అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారాయన. చేసే క్యారెక్టర్ ఏదైనా అందులో విజయ్ సేతుపతి కనిపించరు. తన నటనతో ఆ పాత్రకే వన్నె తేవడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఓ వైపు హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ నచ్చితే విలన్ వేషాలూ వేస్తుంటారాయన. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ లో పాండిరాజ్ పాత్రతో తెలుగు తెరకి పరిచయం అయిన విజయ్.. ‘ఉప్పెన’ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు.

విజయ్ సేతుపతి

 

అంబాసిడర్ కారుకు ఆనుకొని నిల్చొని, మెలి తిప్పిన మీసాలతో, తీక్షణమైన చూపులతో విజయ్ సేతుపతి కనిపిస్తున్నారు. పోస్టర్ ప్రకారం ఆయన నడివయసు వ్యక్తిలా ఉన్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో సరికొత్తగా దర్శనమిచ్చారు. బ్యాగ్రౌండ్‌లో సముద్రం కనిపిస్తోంది.

మరో పోస్టర్‌లో సిగరెట్ తాగుతూ దీర్ఘాలోచనలో ఉన్నారు. సేతుపతి లుక్స్‌లో డెప్త్, ఇంటెన్స్ కనిపిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సానా.. ‘ఉప్పెన’తో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

UPPENA

 

ఏప్రిల్ 2న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

తారాగణం : పంజా విష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ.
సాంకేతిక వర్గం :
కథ, దర్శకత్వం : బుచ్చిబాబు సానా
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : అనిల్ వై, అశోక్ బి.
సీఈవో : చెర్రీ
సినిమాటోగ్రఫీ : శాందత్ సైనుద్దీన్
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీప్రసాద్
ఎడిటర్ : నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్ : మౌనిక రామకృష్ణ
బ్యానర్స్ : మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
విడుదల తేదీ : 2 ఏప్రిల్ 2020.