మామాంగం – రివ్యూ

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హిస్టారికల్ మూవీ ‘మామాంగం’ (హిస్టరీ ఆఫ్ ది బ్రేవ్) - రివ్యూ..

  • Published By: sekhar ,Published On : December 12, 2019 / 12:57 PM IST
మామాంగం – రివ్యూ

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హిస్టారికల్ మూవీ ‘మామాంగం’ (హిస్టరీ ఆఫ్ ది బ్రేవ్) – రివ్యూ..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హిస్టారికల్ డ్రామా.. ‘మామాంగం’ (హిస్టరీ ఆఫ్ ది బ్రేవ్).. కావ్య ఫిలింస్ బ్యానర్‌పై వేణు కున్నప్పిల్లి నిర్మించగా, ఎమ్.పద్మ కుమార్ దర్శకత్వం వహించారు. జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా ఈ హిస్టారికల్ మూవీ ఈ రోజు భారీగా విడుదలైంది.

Image result for mamangam

 కథ విషయానికొస్తే : 
జమోరిన్ మ‌హారాజును అధికారాన్ని ఇష్ట‌ప‌డ‌ని చావెరుక్క‌ళ్ యోధులు ప్ర‌తి 12 సంవ‌త్స‌రాల‌కు ఓసారి ఆయ‌న్ని అంత‌మొందించాల‌ని మామాంగంలో పోరు జ‌రుపుతుంటారు. అయితే ప్ర‌తిసారీ జామోరిన్ రాజు సాముద్రిని అత‌ని సైన్యం కాపాడుతుంటుంది. యుద్ధంలో పాల్గొనే చావెరుక్క‌ళ్ వీరులు వీర మ‌రణం పొందుతుంటారు. కానీ 17వ శ‌తాబ్దంలో జరిగిన మామాంగంలో చంద్రోద‌త్తుడు అనే చావెరుక్క‌ళ్  వీరుడు సాముద్రిని స‌మీపించిన‌ప్ప‌టికీ అత‌ను త‌ప్పించుకుంటాడు. చంద్రోద‌త్తుడు పోరాడ‌కుండా అక్క‌డ ఉన్న జ‌మోరిన్ సైన్యం నుండి త‌ప్పించుకుంటాడు. దాన్ని అవ‌మానంగా భావించిన చావెరుక్కళ్ వంశ‌స్థులు చంద్రోద‌త్తుడుని మోస‌గాడిగా భావిస్తుంటారు. ఆ త‌ర్వాత చంద్రోద‌త్తుడు ఎవ‌రికీ క‌నిపించ‌డు. 24 ఏళ్ల త‌ర్వాత మామాంగం పోరుకి వీరుడు, అత‌ని మేన‌ల్లుడు బ‌య‌లుదేరుతారు. వారిని ముందుగానే ప‌సిగ‌ట్టి చంప‌డానికి జ‌మోరిన్ సైన్యం ప్ర‌య‌త్నాలు చేస్తుంది. సైన్యం చేసే ప్ర‌య‌త్నాల నుండి ఓ వ్య‌క్తి చావెరుక్క‌ళ్ వీరుల‌ను కాపాడుతాడు. ఆ వ్య‌క్తి ఎవ‌రు? చావెరుక్క‌ళ్ వీరులు మామాంగంలో విజ‌యం సాధించారా? క‌న‌బడ‌కుండా పోయిన చంద్రోద‌త్తుడు ఏమైయ్యాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Read Also : వామ్మో వర్మ : అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు – రివ్యూ

నటీనటుల విషయానికొస్తే : 
మ‌మ్ముట్టి న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోనక్క‌ర్లేదు. ఆయ‌న పాత్ర‌లో జీవించేశారు. ఉన్ని ముకుంద‌న్‌, అచ్చుత‌న్, ప్రాచీ తెహ్లాన్, త‌రుణ్ ఆరోరా, సిద్ధిఖీ స‌హా న‌టీన‌టులంద‌రూ అంద‌రూ వారి వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఆయా పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. 

టెక్నీషియన్స్ విషయానికొస్తే :
మ‌నోజ్ పిళ్లై కెమెరా ప‌నిత‌నం బావుంది. ఆర్ట్ వ‌ర్క్‌, కాస్ట్యూమ్స్ అన్నీకూడా పాత్రాల‌ను 17వ శ‌తాబ్దానికి చెందిన‌ట్లు చూపించ‌గ‌లిగాయి. అయితే ఈ క‌థ‌, క‌థ‌నాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అర్థం కావు. అస‌లు సినిమా ఏంటో అర్థం కావ‌డానికి చాలా స‌మయం ప‌డుతుంది. అలాగే సినిమా చాలా స్లోగా ఉంది. ద‌ర్శ‌కుడు ప‌ద్మ‌కుమార్ క‌థ‌నాన్ని వేగవంతంగా ఉండేలా చూసుకుని ఉండుంటే మ‌రికాస్త బెట‌ర్‌గా అనిపించేది. ఎమోష‌న్స్ పండాల్సిన చోట స‌రిగ్గా పండ‌లేదు.