Manchu Vishnu: మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం.. ‘మా’కుటుంబానికి మంచు విష్ణు లేఖ

తెలుగు సినిమా నటులు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మా ఎన్నికల హీట్ టాలీవుడ్‌లో రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఇదే విషయమై ప్రెస్ మీట్ పెట్టి వివరాలు అందించగా.. లేటెస్ట్‌గా తాను నామినేషన్ వేయబోతున్నట్లుగా వెల్లడిస్తూ ఓ లేఖను 'MAA' సభ్యులకు రాశారు.

Manchu Vishnu: మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం.. ‘మా’కుటుంబానికి మంచు విష్ణు లేఖ

Manchu

Manchu Vishnu pens a letter: తెలుగు సినిమా నటులు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మా ఎన్నికల హీట్ టాలీవుడ్‌లో రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఇదే విషయమై ప్రెస్ మీట్ పెట్టి వివరాలు అందించగా.. లేటెస్ట్‌గా తాను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై నటుడు మంచు విష్ణు లేఖ రాశారు. నామినేషన్ వేయబోతున్నట్లుగా వెల్లడిస్తూ ఓ లేఖను ‘MAA’ సభ్యులకు.. నా MAA కుటుంబానికి.. అంటూ లేఖను రాసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మంచు విష్ణు లేఖ ‘యథాతథంగా’..

నమస్కారం..

‘మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నానని ‘మా’ కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియచేయడం. గౌరవప్రదంగా భావిస్తున్నాను. సినిమా పరిశ్రమని నమ్మిన కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు ‘మా’ కుటుంబ సభ్యుల భావాలు, బాధలూ బాగా తెలుసు.. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు మేమెంతో ఋణపడి ఉన్నాము. ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.

మా నాన్నగారు ‘మా’ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, వారి నాయకత్వ లక్షణాలు నాకు మార్గదర్శకాలు అయ్యాయి.

గతంలో ‘మా’ అసోసియేషన్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నేను పనిచేసినప్పుడు ‘మా’ బిల్డింగ్ ఫండ్‌కి నా కుటుంబం తరుపున ఆ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25% అందిస్తానని మాట ఇచ్చాను. బిల్డింగ్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నేను కొన్ని సలహాలు, సూచనలు చేశాను. అవి ‘మా’ కుటుంబ సభ్యుల సహకారంతో దిగ్విజయంగా అమలుచేశాను.

‘మా’ అసోసియేషన్ వ్యవహారలన్నిటినీ అతిదగ్గరగా జాగ్రత్తగా పరిశీలించిన నాకు ‘మా’ కుటుంబసభ్యులకు ఏది అవసరమో? స్పష్టమైన అవగాహన, అనుభవం ఉంది. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం. ‘మా’ సభ్యులలో కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా వుంటాము, అందుబాటులో ఉంటాము. ‘మా’ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా నా సేవలను సంపూర్ణంగా అందించాలని అకుంటున్నాను.

పెద్దల అనుభవాలు, యువరక్తంతో నిండిన కొత్త ఆలోచనలు కలగలిపి నడవాలనేదే నా ప్రయత్నం.. మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని ఆశిస్తూ…

ఆశీస్సులు కోరే..

మీ
విష్ణు మంచు